అచ్చెన్న లేని అసెంబ్లీ.. చూసి తీరాల్సిందే..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. వాడి వేడిగా జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు కరోనా దెబ్బకి కుదించుకు పోయాయి. అయితే టీడీపీ నేతల అరెస్ట్ నేపథ్యంలో జరిగే రెండు రోజులే అత్యంత ఆసక్తిదాయకంగా సమావేశాలు…

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. వాడి వేడిగా జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు కరోనా దెబ్బకి కుదించుకు పోయాయి. అయితే టీడీపీ నేతల అరెస్ట్ నేపథ్యంలో జరిగే రెండు రోజులే అత్యంత ఆసక్తిదాయకంగా సమావేశాలు ఉంటాయని అర్థమవుతోంది. ఇక అసెంబ్లీ అనగానే కొంతమంది నేతలు అలా కళ్లముందు మెదులుతారు. అధికార పక్షం నుంచి కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా ఫైర్ బ్లాండ్లుగా పేరుపడ్డారు. వైసీపీ పేరెత్తకుండా ఎదుటివారి నోరు మూయించాలంటే వీరు లేచి నిలబడతారు.

సావధానంగా చాకిరేవు పెట్టాలంటే ఆర్థిక మంత్రి బుగ్గన, ఆ తర్వాత అంబటి ఇలా మరో లిస్ట్ ఉంది. ఫైనల్ గా సీఎం జగన్ లేచారంటే ప్రతిపక్షాలు వణికిపోక తప్పదు. ఈక్రమంలో ప్రతిపక్షం నుంచి కూడా కొన్ని గొంతులు బలంగా వినిపిస్తుంటాయి. టీడీపీకి ఉన్న 23మంది ఎమ్మెల్యేలలో మాట్లాడే సత్తా ఉన్న ఒకరిద్దరు సైలెంట్ గా ఉండటంతో.. మొదటినుంచీ అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి మాత్రమే చంద్రబాబుకి లెఫ్ట్, రైట్ గా ఉంటూ వచ్చారు.

అందులో కూడా అచ్చెన్నే మరీ ఆవేశపడుతూ కనిపించేవారు. చీటికీ మాటకీ బాబు పక్కకి రావడం, అధికారపక్షం చెప్పే సమాధానాలు వినకుండానే సీఎం జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం అచ్చెన్నాయుడికి అలవాటు. అతిగా ఆవేశపడే మగాడికి బ్రాండ్ అంబాసిడర్ అచ్చెన్నాయుడే అనే పేరు తెచ్చుకున్నారు. విషయం లేకుండా అధికార పక్షంపై దుమ్మెత్తిపోయాలన్నా.. అంతెత్తున నోరేసుకుని పడిపోవాలన్నా కూడా అచ్చెన్నే ముందువరసలో ఉంటారు.

అలాంటి అచ్చెన్న ఈసారి అసెంబ్లీలో కనిపించరు. ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుంటే.. అక్కడ జైళ్లో ఊచలు లెక్కబెడుతున్నారాయన. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే ఈ అరెస్ట్ జరిగిందని టీడీపీ వితండ వాదన చేస్తోంది. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో చేసిన పాపం ఇన్నాళ్లకు పండింది కాబట్టే.. అసెంబ్లీ సమావేశాలున్నా, ఆపరేషన్ చేయించుకున్నా.. అచ్చెన్న జైలుపాలయ్యారు.

మొత్తానికి అచ్చెన్నాయుడు లేని ప్రతిపక్షం, ఆయన గొంతు వినిపించని అసెంబ్లీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో మరికాసేపట్లో చూడబోతున్నాం.

రాజారెడ్డి మీసంలో వెంట్రుకకి కూడా సరిపోవు

లోకేష్ చిప్పకూడుమీద ఆశపడుతున్నాడు