ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టైన తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న కొన్ని కొన్ని రీజన్లు చాలా సిల్లీగా ఉండటం గమనార్హం. అనేక అంశాలను పేర్కొంటూ తనకు బెయిల్ ఇవ్వాలని, ఈ కేసులు విచారణకు తను సహకరిస్తానంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. వాటిల్లో ఉన్న రీజన్లు కొన్ని మరీ ఆశ్చర్యకరంగా ఉండటం గమనార్హం. అవేమిటంటే…
-ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీల రాజ్యసభ సభ్యుల ఎన్నిక జరుగుతుందని అందులో తను ఓటేయాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తనకు బెయిల్ ఇవ్వడానికి దాన్నొక రీజన్ గా ఆయన పేర్కొన్నారు. అయితే రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒక సీటును నెగ్గేంత బలం ఎలాగూ లేదు. ఏదో రాజకీయ రాద్ధాంతం కోసం వర్ల రామయ్య చేత నామినేషన్ దాఖలు చేయించారు. ఆ రాజకీయానికీ తన బెయిల్ కు అచ్చెన్నాయుడు ముడిపెట్టడం గమనార్హం!
-ఇక మరో రీజన్ మరింత విడ్డూరంగా ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అవినీతి విచారణ చేయించాలంటూ తన సోదరుడు దివంగత ఎర్రంనాయుడు అప్పట్లో కోర్టుకు లేఖ రాశారని, అందుకే తనపై కక్ష గట్టి ఇప్పుడు జగన్ విచారణ చేయిస్తున్నాడని అచ్చెన్నాయుడు తన బెయిల్ పిటిషన్లో ఆరోపించారు! ఈ రాజకీయ ఆరోపణ బాగానే ఉంది కానీ, మధ్యలో ఈఎస్ఐ స్కామ్ మాటేంటి?
-తనపై ప్రాథమిక విచారణ లేకుండానే కేసులు నమోదు చేశారంటూ అచ్చెన్నాయుడు చెబుతున్నారు. అలాగే తనపై కేసులు చెల్లవంటూ మరో సాంకేతిక అంశాన్ని కూడా అచ్చెన్నాయుడు పట్టుకున్నారు!
-తనకు శస్త్రచికిత్స జరిగిందంటూ తనను సుదూరం ప్రయాణింపజేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
పూర్తిగా సాంకేతిక, రాజకీయ అంశాలనే అచ్చెన్నాయుడు తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. టెండర్లను పిలిచి అప్పగించాల్సిన పనులను నామినేషన్ పద్ధతిలో ఎందుకు అప్పగించాల్సి వచ్చిందో, ఏకంగా 150 కోట్ల రూపాయల అక్రమాల మాటేంటో.. మాత్రం బెయిల్ పిటిషన్లో అచ్చెన్నాయుడు పేర్కొనలేదు. అవతల ఎవరికి ఎంత కమిషన్ ఇచ్చింది కూడా ప్రైవేట్ కంపెనీల వాళ్లు చెప్పారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, అచ్చెన్న బెయిల్ పిటిషన్ ప్రహసనంగా ఉంది.