కర్చీఫ్ మార్చేసినట్లు పార్టీ మార్చేస్తారా ?

రాజకీయాలు అంటేనే అలా తయారైపోయాయి. పదవుల వెంట పరుగులు తీస్తున్న నాయకులు పార్టీలను మార్చడం షరా మామూలైపోయింది. దాన్ని జనం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు కూడా. Advertisement ఇదిలా ఉంటే విశాఖ జిల్లాకు…

రాజకీయాలు అంటేనే అలా తయారైపోయాయి. పదవుల వెంట పరుగులు తీస్తున్న నాయకులు పార్టీలను మార్చడం షరా మామూలైపోయింది. దాన్ని జనం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు కూడా.

ఇదిలా ఉంటే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద మరో మారు మంత్రి అవంతి శ్రీనివాసరావు హాటు కామెంట్స్ చేశారు. గంటాను ఏకంగా రాజకీయ వ్యాపారి అనేశారు. ఆయనే కాదు చంద్రబాబు కూడా పచ్చి రాజకీయ వ్యాపారం చేస్తున్నారని నిప్పులు కక్కారు.

ఇక‌ గంటా పదవుల కోసం పార్టీలను కర్చీఫ్ మార్చేసినట్లుగా మర్చేస్తారని కూడా మంత్రి సెటైర్లు వేస్తున్నారు. ఇపుడు ఏపీలో మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేల చూపు వైసీపీ మీద పడిందని వార్తలు వస్తున్నాయి.మరి మంత్రి అవంతికి గంటా ఏమైనా ఫ్యాన్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా వాసన వచ్చినట్లుంది. అందుకే  ఆయన చాలా కాలం తరువాత మాజీ మంత్రిని టార్గెట్ చేశారని అంటున్నారు.

గంటాను వైసీపీలోకి తీసుకోమని, ఆయన రాజకీయ ప్రభ పూర్తిగా  తగ్గిపోయిందని కొద్దికాలం క్రితమే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. అయినా కూడా గంటా వైసీపీలోకి చేరుతారు అన్న ప్రచారం మాత్రం ఎక్కడా ఆగడంలేదు.

అసలు ఏం జరుగుతోంది, నిజంగా గంటా పార్టీ మారుతారా అంటే ఆయన అసలు పెదవి విప్పడంలేదు. తానున్న పార్టీలో ఎక్కడా  సౌండ్ లేదు, వైసీపీ మీద మిగిలిన తమ్ముళ్ళ మాదిరిగా రెచ్చిపోవడంలేదు, మరి  గంటా చేతిలో కర్చీఫ్ వైపు చూడడమే ఇపుడు అందరి పనిలా ఉంది.అంతే

మన పాలన-మీ సూచన, 2వ రోజు