ఒకే ఒక్క మాట అర్ధాలు ఎన్నో, ఎన్నెన్నో. వివిధ భాషల్లో ప్రాంతాల్లో ఆ ఒక్క మాటకు ఎన్నో అర్ధాలు అని చెబుతున్నారు మన రాజకీయ పండితులు. ఇంతకీ అంతటి ఘమైన మాట ఏంటి అంటే అందరికీ తెలిసిందే. ఆ మాట బోసడీకే. అది పట్టాభి అనే టీడీపీ నేత వాడారు.
దానికి ఒక ఎంపీగారు బాగున్నారా అని అర్ధమని చెప్పారు. మరో టీడీపీ నేత అయితే గుజరాత్ లో ఏదో గ్రామం పేరు అన్నారు. ఇపుడు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే పాడై పోయిన అని అర్ధమని చెబుతున్నారు. తెలంగాణ పదకోశంలో 'బోసిడికె' అంటే 'పాడై పోయిన' అనే అర్థం ఉందని కూడా అయ్యన్న అంటున్నారు.
మరి ఆ మాటకు అదే అర్ధం ఉందా. లేక మరేమైనా ఉందా.. ఏమో అయ్యన్నకే తెలియాలి. అది సరే కానీ చెత్తనా కొడుకు అన్న మాటకు మాత్రం అర్ధం తిట్టే కదా. అది అచ్చమైన తెలుగు తిట్టే కదా. మరి దానికి మాజీ మంత్రివర్యులు ఏమని సమాధానం చెబుతారో.
ఇవన్నీ పక్కన పెడితే పట్టాభి ఈ మాట అన్నది కూడా జగన్ని కాదు అని కూడా అయ్యన్న చెబుతున్నారు. ఆయన పక్కన ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డినట. మరి ఆయన్ని అయినా ఇలా అనేయొచ్చా.. ఏమో మొత్తానికి బోసడీకే పదానికి బోలెడు అర్ధాలు ఉన్నాయని ఇపుడే తెలుగు సమాజానికి తెలిసింది. దీనికి అంతా కలసి సంతోషించాలేమో.