చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లుతున్న మోదీ..!

“జమిలి ఎన్నికలొస్తే సత్తా చూపిస్తాం, వైసీపీని తరిమికొడతాం..” ఈమధ్య కాలంలో తరచూ చంద్రబాబు చెప్పే డైలాగులివే. కుప్పం పర్యటనలో కూడా ఆయన జమిలి ఎన్నికలనే హైలెట్ చేశారు. ఏడాదిన్నరలో ఎన్నికలొస్తున్నాయ్.. తమ్ముళ్లూ సిద్ధంగా ఉండండి…

“జమిలి ఎన్నికలొస్తే సత్తా చూపిస్తాం, వైసీపీని తరిమికొడతాం..” ఈమధ్య కాలంలో తరచూ చంద్రబాబు చెప్పే డైలాగులివే. కుప్పం పర్యటనలో కూడా ఆయన జమిలి ఎన్నికలనే హైలెట్ చేశారు. ఏడాదిన్నరలో ఎన్నికలొస్తున్నాయ్.. తమ్ముళ్లూ సిద్ధంగా ఉండండి అంటూ కార్యకర్తలకు ఉపదేశమిచ్చారు. 

పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని చతికిలపడిన చంద్రబాబు, రేపు జమిలి ఎన్నికలొస్తే ఏం చేస్తారు? ఇంతకంటే గొప్పగా ఇంకేం సాధిస్తారనేది ఇక్కడ ప్రశ్నార్థకం. కేవలం కార్యకర్తల్ని ఉత్సాహపరచడం కోసమే చంద్రబాబు అలా మాట్లాడుతున్నారని అర్థంచేసుకోవాలి..

అయితే జమిలి అనేది చంద్రబాబు చేతిలో పని కాదు, కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసి, హిందూ అజెండా భుజాన వేసుకుని మోదీ, జమిలికి సిద్ధమయ్యారే అనుకుందాం. అప్పుడేం జరుగుతుంది? మోదీ  హిందూత్వం నిలబడగలదా, ప్రమాదకరంగా మారిన దేశ ఆర్థిక పరిస్థితి, మతాన్ని ముంచేస్తుందా..?

మోదీ వెనకడుగు..

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే మోదీదే హవా అంటూ.. ఆమధ్య ఓ సర్వే రిపోర్ట్ తేలింది. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చేసింది. వాస్తవంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలే వస్తే మోదీకి షాక్ మీద షాక్ తగలడం ఖాయం. పంజాబ్, హర్యాణా, ఉత్తర ప్రదేశ్ లో రైతులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. వ్యవసాయ చట్టాలపై తమను నెలల తరబడి రోడ్లపాలు చేసిన మోదీకి అధికారం దూరం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు.

అటు ప్రైవేటీకరణపై దూకుడుగా వెళ్తున్న మోదీ అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. కరోనా లాక్ డౌన్ ప్రభావాన్ని ఒడ్డునపడ్డవారు మరచిపోవచ్చేమో కానీ, కష్టాలు పడుతున్నవారు మాత్రం గుర్తుంచుకొని మరీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య ప్రధాని మోదీ జమిలికి సై అంటారా అనేది అనుమానమే.

రామమందిర నిర్మాణంతోపాటు.. చైనాతో యుద్ధం లాంటి మరో బలమైన కారణం దొరికితేనే ఆయన ముందస్తు బరిలో దూకుతారు. పరిస్థితులు సహకరించకపోతే సార్వత్రిక ఎన్నికలు 2024లోనే. ఈలోపు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తే మాత్రం జమిలి బరిలో దూకేందుకు మోదీకి ఎక్కడలేని ధైర్యం వస్తుంది.

బాబు పగటికలలు

2024వరకు తన ఆరోగ్యం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్న చంద్రబాబు రెండేళ్ల ముందుగానే ఎన్నికలొస్తాయని కలలు కంటున్నారు. అదే జరక్కపోతే మరో మూడేళ్లు పార్టీని నడపడం బాబుకి తలకు మించిన భారంగా మారుతుంది. 

చేజారుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేరు, పార్టీకి దూరంగా జరుగుతున్న కార్యకర్తలకు ''కమ్మ''ని మాటలు చెప్పి ఎక్కువరోజులు మభ్యపెట్టలేరు. అందుకే ఆయన జమిలి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.

అటు చూస్తే మోదీ రోజు రోజుకీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ సంచలనంగా మారుతున్నారు. తనకు తానే జమిలికి దూరంగా జరిగిపోతున్నారు. చూస్తుంటే, ముందస్తు ఎన్నికల కోసం భారీగా ఆశలు పెట్టుకున్న చంద్రబాబుపై మోదీ పూర్తిగా నీళ్లు చల్లుతున్నారని అర్థమౌతోంది. 

ఓడిపోయే సరికి కుప్పం గుర్తుకు వచ్చిందా

ఈ సినిమా అడ‌క‌పోతే ప్రొడ్యూస‌ర్ల‌కు హ‌ర్ర‌రే