అభిమానులపై అనుచితంగా ప్రవర్తిస్తూ వార్తలకు ఎక్కడం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణకు కొత్తేమీ కాదు. అనేక సార్లు బాలకృష్ణ తన అభిమానుల మీదే చేయి చేసుకున్నారు. అందుకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా ఆయా సందర్భాల్లో వైరల్ గా నిలిచాయి. ఈ క్రమంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ చేయి దురుసు మరోసారి చర్చనీయాంశంగా నిలిచింది.
ఫొటోలు తీస్తున్న యువకుడిని ఒకటికి రెండు సార్లు కొట్టారు బాలకృష్ణ. చివరకు ఆ యువకుడి చేతే మళ్లీ వీడియో రిలీజ్ చేయించి, బాలకృష్ణ తనను కొట్టడం తన అదృష్టం అని చెప్పించి.. వాడినో ఎర్రిపప్ప కింద జమ కట్టింది తెలుగుదేశం పార్టీ. బహుశా బాలకృష్ణ అభిమాలనుందరినీ ఎర్రిపప్పల కింద జమ కట్టడమే అది!
ఏదో ఒకసారి జరిగి ఉంటే.. అది ఆవేశంలో జరిగిందనుకోవచ్చు, కానీ బాలకృష్ణ పదే పదే అదే రిపీట్ చేస్తూ.. తన వైఖరి మీద అనుమానాలను క్రియేట్ చేసి, ఆ అనుమానాలే నిజమయ్యేలా చూసుకున్నారు.
ఇక ఆ సంగతలా ఉంటే.. బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురంలో ఓటుహక్కును వినియోగించుకోవడానికి వెళ్లినప్పుడు మాత్రం మార్పు చూపించేందుకు ప్రయత్నించినట్టుగా ఉన్నారు. పోలింగ్ క్యూలో నిలబడ్డ జనాలను చూసి విసిగెత్తిపోయి వారిని చితక్కొట్టడం కాకుండా, వారిని నవ్వుతూ పలకరించారు. పోలింగ్ స్టేషన్ బయట కొందరితో ఫొటోలు కూడా దిగి బాలకృష్ణ తనలో మార్పు వచ్చినట్టుగా చూపించే ప్రయత్నం చేశారని స్పష్టం అవుతోంది.
బాలకృష్ణకు తోడు ఆయన భార్య వసుంధర కూడా ఈ సీన్ ను పండించేందుకు ప్రయత్నించారు. అభిమానుల మీద ఇలా పేట్రేగిపోతూ ఉండటంతో డ్యామేజ్ తీవ్రం అవుతోందని బాలకృష్ణకు కూడా అర్థమైనట్టుగా ఉంది.
అధికారంలో ఉన్నప్పుడు అలా రెచ్చిపోతే ఎలా అయినా సమర్థించుకోవచ్చు, ఇప్పుడు బాలకృష్ణ తీరు ప్రతిపక్షంలోని టీడీపీకే పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో.. డ్యామేజ్ కవరేజ్ లో భాగంగా బాలకృష్ణ కొత్త డ్రామాకు తెరతీసినట్టుగా ఉన్నారు. అయితే మళ్లీ జనాల మధ్యకు వస్తే బాలకృష్ణ ఎలా రెచ్చిపోతారో అనే ఇది మార్పా, డ్రామానా అనే అంశంపై స్పష్టత ఇస్తుంది.