వైసీపీ సర్కార్ కి విశాఖ ప్రాధాన్యత ఎంటో తెలుసు. విశాఖను రాజధానిగా చేయాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. ఇందుకోసం చట్టం కూడా చేసింది.
అది న్యాయ పరిశీలనలో ఉంది. ఈలోగా ప్రభుత్వం తరఫున జరగాల్సినవి చేయాల్సినవి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాట్లుగా తెలుస్తోంది. అదే టైమ్ లో అధికారంలో వైసీపీ మరో అడుగు ముందుకు వేస్తోంది.
తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ముందు పార్టీగా వైసీపీ విశాఖకు వస్తుంది అన్న మాట. పరిపాలనా రాజధానిలో రాజకీయ కార్యకలాపాలు అన్నీ ప్రారంభించడానికి వైసీపీ వేస్తున్న తొలి అడుగుగా దీన్ని భావించాలి
ఇక వైసీపీ ఆఫీస్ కి సంబంధించి స్థలాన్ని చూసుకున్నట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే సాధ్యమైనంత తొందరలో విశాఖకు వైసీపీ కేంద్ర కార్యాలయం షిఫ్ట్ అవుతుందని చెబుతున్నారు.
మరి ఆ తరువాత సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా విశాఖకు వచ్చే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని అంటున్నారు. అంటే విశాఖకు రాజధాని కళ కట్టినట్లే అనుకొవాలి.