కమలాన్ని ముగ్గులోకి లాగుతున్నారా?

బీజేపీతో పొత్తు ఉంది. దానికో లెక్క కూడా ఉంది. అలాంటపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని డిమాండ్ చేసి కాపులకు రిజర్వేషన్లు ఇప్పించే పనేదో జనసేనాని పవన్ చేయవచ్చు కదా అన్న చర్చ నడుస్తోందిపుడు.…

బీజేపీతో పొత్తు ఉంది. దానికో లెక్క కూడా ఉంది. అలాంటపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని డిమాండ్ చేసి కాపులకు రిజర్వేషన్లు ఇప్పించే పనేదో జనసేనాని పవన్ చేయవచ్చు కదా అన్న చర్చ నడుస్తోందిపుడు.

పవన్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారని విమర్శించగానే ఆ పార్టీలోని నాయకులు జగన్ సర్కార్ మీద ఒక్కసారిగా  విమర్శలు అందుకుంటున్నారు. ఎన్నికల్లో హామీలిచ్చి వచ్చి జగన్ మాట తప్పారని అంటున్నారు. నిజానికి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ నిక్కచ్చిగా చెప్పేశారు. వారి సంక్షేమానికి ఆయన  చేయాల్సింది అంతా చేస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ మహరాష్ట్రలో మరాటీలకు రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో అలా ఏపీలో కూడా జగన్ చేయాలని కొత్త డిమాండ్ పెడుతున్నారు. మరి నిన్నటిదాకా మహారాష్ట్రను ఏలింది బీజేపీనే కదా. ఆ పార్టీతో దోస్తీ కూడా ఉంది కదా. ఆ పనేదో రాజమార్గంలోనే కేంద్రం ద్వారా చేయించవచ్చు కదా అన్నది కాపు నేతల వాదన, ఆవేదన కూడా.

కాపులకు న్యాయం చేసేది జనసేన, బీజేపీ కూటమి మాత్రమేనని ఆయన అంటున్నారు. అంటే 2024లో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఇచ్చేస్తామని బీజేపీ తరఫున కూడా వకల్తా పుచ్చుకుని జనసేన నాయకులు చెబుతున్నారు. ఇంతకీ ఏపీ బీజేపీ నాయకులు దీని మీద ఏమంటారో. కాపుల రిజరేషన్ల మీద బీజేపీ ఇంతవరకూ పెదవి విప్పింది లేదు కానీ మా కూటమి వస్తే ఇచ్చేస్తామని జనసైనికులు చెప్పడం ద్వారా కమలం పార్టీని కూడా ముగ్గులోకి లాగేస్తున్నారు. మరి చూడాలి ఇది ఎంతవరకూ పోతుందో.

ఐదుసార్లు ట్రైచేసి నావల్లకాక వదిలేసాను

'పీవీ'ని ఆకాశానికి ఎత్తేసిన కెసిఆర్