సంచయిత వారసత్వం నిరూపించుకోవాలట?

ఇది నిజంగా విడ్డూరమే. లీగల్ వ్యవహారాలు తేల్చడానికి కోర్టులు ఉన్నాయి. ఎవరైనా ఎవరినైనా ఎన్ని అయినా అనవచ్చు. నోటి మాటలతో ఆరోప‌ణలు చేయవచ్చు. అంత మాత్రం చేత వారు అర్జంటుగా పదవి దిగిపోవాలని డిమాండ్…

ఇది నిజంగా విడ్డూరమే. లీగల్ వ్యవహారాలు తేల్చడానికి కోర్టులు ఉన్నాయి. ఎవరైనా ఎవరినైనా ఎన్ని అయినా అనవచ్చు. నోటి మాటలతో ఆరోప‌ణలు చేయవచ్చు. అంత మాత్రం చేత వారు అర్జంటుగా పదవి దిగిపోవాలని డిమాండ్ చేయడం దిగజారుడు రాజకీయమే అవుతుంది.

తేడాగల‌ పార్టీ అని చెప్పుకునే బీజేపీ కూడా ఇపుడు చిల్లర రాజకీయానికి తెర తీయడమే విశేషం. సింహాచలం ఆలయ ట్రస్ట్ చైర్ పర్సన్ గా సంచయిత నియామకం చెల్లదంటూ బీజేపీ నేతలు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఆమె పూసపాటి వారి వారసురాలు తానేనని అర్జంటుగా  నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అంతవరకూ ఆమె చైర్ పర్సన్ కుర్చీ ఎక్కరాదని కూడా కండిషన్ పెడుతున్నారు. ఇంతకీ సంచయిత పూసపాటి వారి వారసురాలు కాదు అన్న డౌట్ ఎందుకు వచ్చిందంటే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అలా అన్నారట. ఆమెకు పూసపాటి కుటుంబానికి సంబంధం లేదని రాజు గారు చెప్పారు కాబట్టి ఆమెకు సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ పదవి ఎలా దక్కుతుందని బీజేపీ పెద్ద ప్రశ్నే వేస్తోంది.

కందకు లేని దురద కత్తికి అన్నట్లుగా రాజుల మధ్య వివాదం అది.  పైగా కోర్టులో కేసులు ఉన్నాయి. మధ్యలో తగుదునమ్మా అని కమలనాధులు దూరి రచ్చ చేయడం చూస్తూంటే ఇంతకంటే పెద్ద  ప్రజా సమస్య ఏదీ వారికి కనిపించలేదా అన్న డౌట్లు వస్తున్నాయి. చిత్రమేంటంటే సంచయిత కూడా బీజేపీ నాయకురాలే.  మరి తమ పార్టీ నేత మీదనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన బీజేపీ రాజనీతిని మెచ్చుకుతీరాల్సిందేగా.

ఏపీలో రేపటినుంచి కొత్త రాజకీయం

కల్నల్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ హోదా