ఈసారి జగనే చెప్పారు కాబట్టి…

ఉత్తరాంధ్రా అభివృద్ధికి రాచబాట వేసే బృహత్తర కార్యక్రమం అది. ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్. విశాఖ విజయనగరం మధ్యలో భోగాపురం దగ్గర నిర్మించాలన్నది ఒక కల. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అది సాకారం…

ఉత్తరాంధ్రా అభివృద్ధికి రాచబాట వేసే బృహత్తర కార్యక్రమం అది. ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్. విశాఖ విజయనగరం మధ్యలో భోగాపురం దగ్గర నిర్మించాలన్నది ఒక కల. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అది సాకారం కాలేదు.

ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతుంది అనుకున్నారు. కానీ సగం పాలన గడచింది. ఇన్నాళ్లూ అనేక ముహూర్తాలు దానికి సంబంధించి పెట్టారు. ఇపుడు ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగనే చెప్పారు. వచ్చే నెల అంటే అక్టోబర్ లో భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తామని. దాంతో అందరికీ నమ్మకం కుదురుతోంది.

మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో  పీపీపీ పద్ధతిలో నిర్మించే ఈ ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రాకే తలమానికం అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే ఎయిర్ పోర్టు నిర్మాణానికి అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అక్కడ కొంతమంది కోర్టుకు వెళ్ళడంతోనే ఈ జాప్యం జరిగింది అని వైసీపీ నేతలు అంటున్నారు. 

మొత్తానికి గండాలు అన్నీ దాటుకుని ఈ ఎయిర్ పొర్టు నిర్మాణానికి నోచుకుంటే కచ్చితంగా రెండేళ్ళలో ఉపయోగంలోకి వస్తుంది, ఆ మీదట ఉత్తరాంధ్రా దశ దిశ కూడా మారిపోతుందని అంటున్నారు.