అమ‌రావ‌తి భూ కుంభ‌కోణంలో ఇది మ‌రో కోణం!

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప్ర‌స్తావించిన కొన్ని అంశాలు అత్యంత విస్మ‌య‌క‌రంగా ఉన్నాయి. అమ‌రావ‌తి భూముల విష‌యంలో చంద్రబాబు నాయుడి ప్ర‌భుత్వం అనుస‌రించిన తీరును కూలంక‌షంగా విశ‌దీక‌రించారు బుగ్గ‌న‌. ప్ర‌త్యేకించి భూకేటాయింపుల…

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప్ర‌స్తావించిన కొన్ని అంశాలు అత్యంత విస్మ‌య‌క‌రంగా ఉన్నాయి. అమ‌రావ‌తి భూముల విష‌యంలో చంద్రబాబు నాయుడి ప్ర‌భుత్వం అనుస‌రించిన తీరును కూలంక‌షంగా విశ‌దీక‌రించారు బుగ్గ‌న‌. ప్ర‌త్యేకించి భూకేటాయింపుల విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌రించిన తీరును అర్థం చేసుకుంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. అధికారాన్ని చేతిలోపెట్టుకుని అమ‌రావ‌తి భూముల విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు త‌న ఇష్టానికి వ్య‌వ‌హారించిన వైనాన్ని బుగ్గ‌న ఎండ‌గ‌ట్టారు.

అది సులువుగా అర్థ‌మ‌య్యే రీతిలో చెప్పారు బుగ్గ‌న‌. అమ‌రావ‌తి అని సేక‌రించిన భూముల్లో ప్రైవేట్ వాళ్ల‌కు కేటాయించిన భూముల‌ను చౌక‌ధ‌ర‌కు, అదే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు మాత్రం అందుకు అనేక ఎక్కువ రెట్ల‌కు భూముల‌ను కేటాయించారు చంద్ర‌బాబు నాయుడు. అందుకు ఆధారాల‌ను కూడా చూపించారు బుగ్గ‌న‌.

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కు ఎక‌రా కోటి రూపాయ‌ల చొప్పున ఐదున్న‌ర ఎక‌రాలు ఇచ్చారు. అది కూడా శాశ్వ‌త విక్ర‌యం కాదు, 60 సంవ‌త్స‌రాల లీజుకు.  అలాగే కాగ్ కు ప‌దిహేడు ఎక‌రాల భూమిని కోటి రూపాయ‌ల చొప్పున ఇచ్చారు.  అది కూడా లీజుకే.

అదే శాశ్వ‌త విక్ర‌య హ‌క్కుల ధ‌ర విష‌యానికి వ‌స్తే.. ఎస్ బీఐ మూడు ఎక‌రాల భూమిని కొనుగోలు చేయ‌గా.. దాని నుంచి ఎక‌రాకు నాలుగు కోట్ల రూపాయ‌ల చొప్పున వ‌సూలు చేశారు. నాబార్డు, భార‌త ఆహార‌సంస్థ‌, ఎల్ఐసీ, విజ‌య బ్యాంకు, యూబీఐ.. వీట‌న్నింటికీ ఎక‌రా భూమిని రెండు, నాలుగు కోట్ల రూపాయ‌ల స్థాయిలో ఇచ్చారు.

క‌ట్ చేస్తే.. ప్రైవేట్ సంస్థ‌ల‌కు అమ్మిన భూమిని మాత్రం కారు చౌక‌గా ఇచ్చారు. శాశ్వ‌త విక్ర‌యంగా ప‌లు ప్రైవేట్ సంస్థ‌ల‌కు భూములు ఇచ్చారు. వాటిల్లో విట్, ఎస్ఆర్ఎం యూనివ‌ర్సిటీ, మెడిసిటీ.. వీటికి వంద‌ల ఎక‌రాల భూమిని ధారాద‌త్తం చేశారు. అది ఎక‌రా 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు!

ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కేమో ఎక‌రా నాలుగు కోట్ల రూపాయ‌ల మొత్తానికి అమ్మారు. అదే అయిన వారి ప్రైవేట్ సంస్థ‌ల‌కు, విద్యా వ్యాపార‌స్తుల‌కు మాత్రం ఎక‌రా యాభై ల‌క్ష‌లే. అది కూడా వంద‌ల ఎక‌రాలు వీళ్ల‌కు ఇచ్చారు. .రెండు వంద‌లు, నూటా యాభై ఎక‌రాల భూమిని యాభై ల‌క్ష‌ల రూపాయ‌ల ధ‌ర‌కు ఇచ్చారు. అది శాశ్వ‌త విక్ర‌యం. ఆ భూమిని వారు తిరిగి అమ్ముకోవ‌చ్చు కూడా! 

దీన్ని ఏమ‌నాలి? ప‌్ర‌జ‌ల డ‌బ్బుతో న‌డిచే సంస్థ‌ల‌తో కోట్ల రూపాయ‌లు తీసుకుని, ప్రైవేట్ వ్యాపార‌స్తుల‌కు 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు ఎక‌రాతో వంద‌ల ఎక‌రాల భూముల‌ను అప్ప‌గించారంటే.. దీన్ని కుంభ‌కోణం అనకూడ‌దా? అమ‌రావ‌తి భూ కుంభ‌కోణంలో ఇంత వ‌ర‌కూ సామాన్యుల‌కు పెద్ద‌గా తెలియ‌ని అంశం ఇది. ఇంకా ఎన్ని లొసుగులు ఉన్నాయో!

అందరి పేర్లు బయట పెట్టి వణికించిన బుగ్గన