బతికి ఉన్నన్ని రోజులూ వాళ్లు కష్టాల్లో ఉంటే పట్టించుకోరు. సదరు నేతలు చనిపోతే మాత్రం ఆ మరణాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవడంలో మాత్రం చంద్రబాబు నాయుడు ముందుంటారు. ఇది ఎవరో అనేమాట కాదు. ఆయన తీరును పరిశీలిస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అయ్యేమాట. తన పార్టీ నేతలు ఎవరైనా చనిపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు చేసే వీరంగాలు అలాగిలాగా ఉండవు. అది కూడా తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సదరు నేతలు చనిపోతే చంద్రబాబు నాయుడు రాజకీయంగా దాన్ని వాడుకొంటూ ఉంటారు.
ఇప్పుడు కోడెల శవంతో చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఈ అంశంపై పెట్టిన ప్రెస్ మీట్ వింటే.. ఇంతకీ ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అర్థంకాదు. అయితే కోడెల మరణాన్ని రాజకీయంగా వాడుకోవాలని ఫిక్సయ్యారని మాత్రం స్పష్టం అవుతోంది.
కోడెల బతికి ఉన్నన్ని రోజులూ ఆయనను ఇబ్బంది పెట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్లే. ఆయన మీద ఫిర్యాదులు చేసిన వారిలో కూడా తెలుగుదేశం వాళ్లే ముందున్నారని స్పష్టం అవుతోంది. ఇక కోడెలను ప్రభుత్వం వేధించిందని ఇప్పుడు అంటున్నారు కదా.. మరి ఆయన బతికి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ మాట మాట్లాడలేదు? ఆయన బతికి ఉన్నప్పుడు ఆయనకు సానుకూలంగా మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు ముందుకురాలేదు. మాట్లాడితే ఎక్కడ మకిలి అంటుకుంటుందో అని భయపడ్డారు.
ఇప్పుడు చనిపోయారు కాబట్టి.. రాజకీయం చేయాలని చూస్తున్నారు తప్ప.. కోడెల మీద చంద్రబాబుకు ఎలాంటి ఆపేక్షలూ లేవని సామాన్యులు అనుకుంటున్నారు. ఈ అంశంపై చంద్రబాబు నాయుడు ఎంత లాగితే.. అంతగా ఆయన తీరు చర్చనీయాంశం అవుతుంది. బతికి ఉన్నప్పుడు పట్టించుకోడు.. శవాలు లేస్తే మాత్రం ఇలాంటి రాజకీయాలు చేయడానికి ముందుకొస్తారు..అంటూ చంద్రబాబు నాయుడు గురించి తెలుగుదేశం వాళ్లే అనుకుంటున్నా, అది వాళ్ల తప్పుకాదు. చంద్రబాబు నాయుడి తీరే అలా ఉంటోంది.
కాబట్టి ఈ అంశం గురించి చంద్రబాబు నాయుడు ఎంత తక్కువగా మాట్లాడితే.. ఇక ఆయనకే అంత మంచిదని, లేకపోతే తెలుగుదేశం నేతలు కూడా చంద్రబాబు నాయుడు తీరు మీద ఒక స్పష్టతకు వచ్చి, ఇక ముందు ఆయన కోసం వీరంగాలు ఆడటం చాలావరకూ తగ్గుతుందని విశ్లేషకులు అంటున్నారు!