చంద్రబాబు వరస్ట్‌ సీఎం: జేసీ దివాకర్‌రెడ్డి.

చంద్రబాబుని అప్పుడే తిడతారు.. అంతలోనే చంద్రబాబుని పొగుడుతారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ‘మా వాడే’ అని అంటారు.. ఆ వెంటనే, వైఎస్‌ జగన్‌ని బూతులు తిట్టేస్తారు. సీనియర్‌ పొలిటీషియన్‌ అన్న పేరే తప్ప,…

చంద్రబాబుని అప్పుడే తిడతారు.. అంతలోనే చంద్రబాబుని పొగుడుతారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ‘మా వాడే’ అని అంటారు.. ఆ వెంటనే, వైఎస్‌ జగన్‌ని బూతులు తిట్టేస్తారు. సీనియర్‌ పొలిటీషియన్‌ అన్న పేరే తప్ప, ఆయన నోటికి హద్దూ అదుపూ వుండదు.

అలా ఓ సాధారణ పోలీస్‌ అధికారి మీద నోరు జారడం వల్లే.. రాజకీయాల్లో అత్యంత పతనావస్థకు పడిపోయారు.. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితుడైన ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి.

చంద్రబాబు హయాంలో లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన జేసీ దివాకర్‌రెడ్డి, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దాదాపుగా గుడ్‌ బై చెప్పేసినా, ఇంకా ఆ రాజకీయ యావ తగ్గకపోవడంతో.. అడపా దడపా పొలిటికల్‌ స్టేట్‌మెంట్లు దంచేస్తున్నారు. 2024లో చంద్రబాబే ముఖ్యమంత్రిగా వుంటారట. అయితే, అప్పుడాయన్ని అందరూ వరస్ట్‌ సీఎంగా చూస్తారట. దానికి కారణం, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డేనట.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించిన జేసీ దివాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ గెలవడం ఖాయమని తేల్చేశారు. టీడీపీ ఎంత గింజుకున్నా దండగేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఇతర పార్టీల నుంచి ఎవరన్నా గెలిస్తే, జైలుకు వెల్ళాల్సిందేనట.. ఆ దిశగా వైఎస్‌ జగన్‌ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసుకున్నారట.

‘వేరే పార్టీల నుంచి ఎవరు గెలిచినా, వారిని వైసీపీలోకి లాగెయ్యడమో.. లేదంటే వారిపై కేసులు పెట్టడమో జరుగుతుంది.. అందుకే, పోటీ చేయొద్దని చంద్రబాబుకి సూచించాను..’ అని దివాకర్‌రెడ్డి తనదైన స్టయిల్లో చెప్పుకుంటూ పోయారు.

ఇదే, ఈ రాజకీయమే ముందు ముందు చంద్రబాబు కూడా పాటిస్తారు. అప్పుడు ఆయన రాజకీయం ఇంకా దారుణంగా వుంటుంది.. అంటూ జేసీ ఊగిపోయారు. అసలంటూ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు వుందా.? అంటే, లేదనే చర్చ టీడీపీ వర్గాల్లోనే జరుగుతోంది.

రాజకీయంగా చంద్రబాబు అత్యంత పతనావస్థను చూస్తున్నారిప్పుడు. మళ్ళీ ఆయన పుంజుకోవడం అసాధ్యం. అలాంటిది, చంద్రబాబు ‘వరస్ట్‌ సీఎం’గా 2024లో వుంటారట. అప్పటిదాకా మాత్రం అందరిలోకీ ఆయనే బెస్ట్‌ సీఎం అని జేసీ దివాకర్‌రెడ్డి కితాబులివ్వడం గమనార్హం.

ఒక ప్రిన్సిపల్ కడుపులో గుండాగాడు పుట్టాడు