2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయాకా చంద్రబాబు నాయుడు ఇలాంటి అంశాలనే ప్రస్తావించారు. తమ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ వాళ్లు దాడులు చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు అప్పట్లో చాలా హడావుడి చేశారు. దానిపై చంద్రబాబు నాయుడు చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు!
ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు ఒక్కడే పరామర్శలకు బయల్దేరారు. అయితే అప్పట్లో తెలుగుదేశం నేతలంతా పరామర్శలకు వెళ్లేవారు. రాయలసీమ ప్రాంతంలో అప్పట్లో ఒక ఎమ్మెల్యే హత్య జరిగింది. పరిటాల రవిని చంపేశారు.
అధికారం ఉన్నంత సేపూ పరిటాల విషయంలో వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని వందలమంది కాంగ్రెస్ కార్యకర్తల హత్యల్లో పరిటాల రవి పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. అవన్నీ అందరికీ తెలిసినవే!
పులి స్వారీ చేసిన పరిటాల రవి చివరకు అదే పులికి బలైపోయాడని పరిశీలకులు కూడా చెబుతూ వచ్చారు. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ హత్యపై చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు.
ఏదో గాంధీ మహాత్ముడిని హత్య చేసిన రీతిలో చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్రమంతా అల్లకల్లోలం చేశారు. కొన్ని వందల బస్సులను తగలబెట్టారు. అలా ప్రభుత్వాస్తులను తగలేసిన ఘనత తెలుగుదేశం వాళ్లకే దక్కింది. ఇక ఇప్పుడు ఏవో కొన్ని సంఘటనలను పట్టుకుని చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయం అంతా ఇంతా కాదు!
గత ఐదేళ్లలో తెలుగుదేశం హయాంలో జరిగిన హత్యల గురించి చంద్రబాబు నాయుడు సందర్భంగా సమాధానం ఇవ్వాల్సి ఉంది. అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నేతల హత్యలు, వారిపై దాడులు చాలానే జరిగాయి. అవన్నీ కప్పిపెట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజకీయం చేస్తూ ఉన్నారు! ఓడిపోయినప్పుడల్లా చంద్రబాబుకు ఇదే పని!