బాబుకు ఏ ఊరు చూసినా ‘జాతి’ జర్నలిస్టులున్నట్టున్నారు. గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకు చీమ చిటుక్కుమన్నా ఏపీ సీఎం జగనే కారణమని ట్వీట్లు, వీడియోలు పెట్టే శేఖర్‌గుప్తా లాంటి వారు రెడీగా ఉంటారు. గతంలో రాజధానుల మార్పుపై శేఖర్‌గుప్తా సోషల్ మీడియాకెక్కి అభాసుపాలయ్యాడు. దాంతో కథ అడ్డం తిరిగిందని చంద్రబాబు భావించినట్టున్నాడు. ఈ సారి జాతీయ జర్నలిస్టుల ప్రస్తావన తీసుకొచ్చాడే కానీ, వారి పేర్లు మాత్రం బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డాడు.
బాబు చెప్పినంత తీవ్రస్థాయిలో ఏపీ ప్రభుత్వానికి పక్షవాతం వచ్చిందని ఏ జాతీయ మీడియా జర్నలిస్టులు అన్నారో పేర్లు ప్రకటించి ఉంటే బాగుండేది. జాతీయ మీడియా అన్నట్టు ప్రభుత్వానికి ‘పక్షవాతమా’ లేక ప్రతిపక్షాల ‘పక్షపాతమా’ అనే విషయం తేలాలి. అలాగే రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్న బాబు గారు, ఇంతకూ 29 గ్రామాల ఆందోళనే రాష్ట్ర బాధా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
ఇకపోతే మహిళలను బూటు కాళ్లతో తన్నడానికి సంబంధించి ఎల్లో మీడియాలో ఫొటోలు, ఇతర అంశాలపై బాబు ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇక్కడో విషయాన్ని చంద్రబాబు, ఆయన అభిమానులు గమనించాల్సి ఉంది. అదేంటంటే ఎక్కడో మహిళలపై జరిగిన దాష్టీకాన్నికూడా రాజధాని ఖాతాలో జమ చేస్తూ మహా మేధావి చలసాని శ్రీనివాసరావు ట్వీట్ చేశాడు.
ఇలాంటి మార్ఫింగ్‌ల వల్ల నిజంగా నిజమైన వాటిని కూడా నమ్మలేని పరిస్థితి. అంతెందుకు జాతీయ మహిళా కమిషన్ కూడా టీడీపీ చెప్పిన, చూపిన ఆధారాలపై అనుమానం వ్యక్తం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఊరు, పేరు లేకుండా జాతీయ జర్నలిస్టులని చెప్పడం…సీఎంగా పనిచేసిన వ్యక్తి స్థాయికి తగునా? ఎటూ మనకు ఏమీ చెప్పక పోయినా రాసేందుకు, చూపేందుకు ‘జాతి’ జర్నలిస్టులుండగా, జాతీయ జర్నలిస్టులతో పనేంటి సార్?