అన్ని ఉద్యోగాలు ఇస్తారా.. చంద్రబాబు ఫైర్!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు. టీడీపీ హయాంలో సాంతం నాకేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు గణాంకాలతో సహా చెబుతున్నారు. విభజన నాటికి ఎంత…

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు. టీడీపీ హయాంలో సాంతం నాకేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు గణాంకాలతో సహా చెబుతున్నారు. విభజన నాటికి ఎంత అప్పు ఉండేది, ఐదేళ్లలో ఎంత అప్పు చేశారు.. అనే అంశాల గురించి ఆర్థిక మంత్రి ఇటీవలే వివరించారు. అప్పులు తెచ్చిన డబ్బును ఏం చేశారనే అంశం గురించి కూడా ఆయన వివరించారు. పప్పు బెల్లాల పథకాలకు, ఓట్ల కొనుగోలుకు డబ్బులు వాడారనే విషయాన్ని విశదీకరించారు.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయడు స్పందించారు. తమ హయాంలో ఆర్థిక వ్యవస్థను భ్రస్టుపట్టించారనేది అబద్ధమని చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు స్టేట్ మెంట్లో గణాంకాలు లేవు. ఎంత అప్పులు తెచ్చింది, ఏం చేసింది చంద్రబాబు నాయుడు చెప్పలేకపోతున్నారు.

అప్పులు తెచ్చి పప్పులు పంచిన వైనాన్ని, తమ అనుకూలురుకు కాంట్రాక్టుల పేరుతో దోచిపెట్టిన ఆరోపణల విషయంలో చంద్రబాబు స్పందించలేదు. అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేదని అనకూడదట. అన్నింటికి మించి చంద్రబాబు ప్రసంగంలో జోక్ ఏమిటంటే.. 'అన్ని ఉద్యోగాలను ఎవరు ఇమ్మన్నారు? ఏం చేసుకుని నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు?' అంటూ చంద్బరాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు!

అంటే ఉద్యోగాలు ఇవ్వడాన్ని చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తూ ఉన్నారు. తనలాగా నిరుద్యోగ భృతి అని ఊరికే కూర్చోబెట్టి తలా వెయ్యి, రెండు వేల రూపాయలు పంచడమే పాలన.. అన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడి తీరు. తన హయాంలో మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసిన ఈయన ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే మాత్రం అస్సలు సహించలేకపోతూ ఉండటం గమనార్హం!

నీ తెలుగు కంటే నేనే మేలు.. హాట్ యాంకర్ డైరెక్టర్ చిట్ చాట్