మోడీ ఒక అరాచకవాది, ఇప్పుడు విబేధాలే లేవట!

ఇటీవలి ఎన్నికలకు ముందు కూడా ప్రధానమంత్రి హోదాలో ఉండిన నరేంద్రమోడీ గురించి తెలుగుదేశం అధినేత, అప్పటికి ముఖ్యమంత్రిగా ఉండిన చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు అన్నారో అందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రచార సభల్లో అయితేనేం,…

ఇటీవలి ఎన్నికలకు ముందు కూడా ప్రధానమంత్రి హోదాలో ఉండిన నరేంద్రమోడీ గురించి తెలుగుదేశం అధినేత, అప్పటికి ముఖ్యమంత్రిగా ఉండిన చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు అన్నారో అందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రచార సభల్లో అయితేనేం, పోలింగ్ ముగిసిన తర్వాత అయితేనేం.. మోడీని చంద్రబాబు నాయుడు తిట్టని తిట్టులేదు! మోడీ మీద ఒక రేంజ్ లో రెచ్చిపోయారు చంద్రబాబు నాయుడు.

అవి కేవలం రాజకీయ విమర్శలు అని కొట్టి పారేయడానికి లేదు. మోడీని ఒకరకంగా విమర్శంచలేదు. అంతేనే.. ఓడిపోతే తనకు కుటుంబం ఉందని, కుటుంబంతో గడుపుతానంటూ చంద్రబాబు నాయుడు అప్పుడు చెప్పుకున్నారు. మోడీకి ఓడిపోతే కనీసం కుటుంబం కూడా లేదు అని వ్యాఖ్యానించిన పెద్దమనిషి చంద్రబాబు నాయుడు.

'మోడీ నాకు భయపడ్డారు, మోడీ ఒక అరాచకవాది, అతడికి కుటుంబం కూడా లేదు..' అనే విమర్శలను ఏ ఉద్దేశంతో చేస్తారో, వాటిని వ్యక్తిగత విమర్శలు అంటారా లేదా.. అనేది ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికి అయినా అర్థం  అవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు లెక్కలో జనాలకు ఎవరూ అలాంటి కనీస జ్ఞానంలేదు. తను ఏది చెబితే అది వింటూ, తనను నమ్ముతూ ఉంటారనే భ్రమలో మిగిలిపోయారు ఆయన.

అందుకే అప్పుడే ఇప్పుడు మోడీ మీద ప్రశంసలు మొదలుపెట్టారు. మోడీతో తనకు వ్యక్తిగత విబేధాలు లేవని ప్రకటనలు చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏపీలో పోలింగ్ కూడా అయిపోయాకా.. పక్కరాష్ట్రాలు తిరిగి మరీ మోడీని ఓడించాలంటూ ప్రచారం చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా వెళ్లి చంద్రబాబు నాయుడు తనకు తోచింది మాట్లాడారు.

మోడీపై విరుచుకుపడ్డారు. మోడీని ఓడించడమే లక్ష్యమని ప్రకటనలు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ మోడీ గురించి భజన మొదలుపెడుతూ ఉన్నారు. ఇందీ చంద్రబాబు మార్కు మరో యూటర్న్. ఇలాంటివి తీసుకుని తీసుకునే ఆఖరికి చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లకు మిగిలారు. అయినా ఆయన అదే తీరును కొనసాగిస్తూ ఉన్నారు. మరి వచ్చేసారికి ఎన్ని మిగులుతాయో!

తెరమీద నీతులు.. తెర వెనుక బ్లాక్ మెయిలింగ్