చంద్రబాబుకు తనకు అవసరం అయిన విషయాలు మాత్రమే గుర్తుంటాయి. గతంలో తాను చేసిన పొరపాట్లు, తప్పులు అసలు గుర్తుకురావు. అలా ఆయన మైండ్ ని ట్యూనప్ చేసుకున్నారు. అందుకే ఆయన ఇపుడు తాను ఏమీ ఎరగనన్నట్లుగా వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేస్తున్నారు.
మరి టీడీపీలో పాతికేళ్ళ ప్రస్థానం సాగించి బాబుతో విసిగి వేసారిన మైనారిటీ పెద్దలు నాయకులు బాబు చెప్పే శ్రీరంగ నీతులు వింటూ ఊరుకుంటారా. అందుకే వారు గట్టిగానే తగులుకుంటున్నారు.
మొత్తం మూడు టెర్ములు సీఎం గా ఉన్న కాలంలో బాబు మైనారిటీలకు చేసిందేంటి అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్ గట్టిగానే తగులుకున్నారు. కల్లబొల్లి హామీలు ఇచ్చి వారిని మోసం చేయబట్టే కదా టీడీపీకి మైనారిటీలు దూరం అయ్యారని కూడా రహమాన్ ఎత్తి పొడిచారు.
ఇపుడు తగుదునమ్మా అని బాబు నంద్యాల ఘటనను అడ్డం పెట్టుకుని వైసీపీ సర్కార్ మీద కుట్ర రాజకీయాలకు దిగుతున్నారని ఆయన మండిపడుతున్నారు. దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు జగన్ ఏడాదిన్నర కాలంలో మైనారిటీల సంక్షేమానికి ఖర్చు చేశారని కూడా రహమాన్ గుర్తు చేశారు.
ఇక మైనారిటీల రక్షణ, భద్రత చూసినా వైసీపీ సర్కార్ చేసినంతగా ఎవరూ చేయలేదని కూడా ఆయన క్లారిటీగా చెప్పేశారు. బాబు హయాంలో నంద్యాల మించిన ఘాతుకాలు, దారుణాలు ఎన్నో జరిగాయని కూడా రహమన్ ఆరోపించారు.
నంద్యాల దురదృష్టకరమని, అయినా జగన్ తక్షణం స్పందించి బాధితులకు న్యాయం చేశారని రహమాన్ చెప్పారు. బాబు ఇకనైనా కుట్ర రాజకీయాలు ఆపాలని, మైనారిటీలపైన కల్లబొల్లి ప్రేమను కట్టిపెట్టాలని కూడా రహమాన్ గట్టిగా కోరారు.
కుట్రలు, కుతంత్రాలు బాబుకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టే సొంత మామను కూడా వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారని రహమాన్ అంటున్నారు. మొత్తానికి మైనారిటీలతో రాజకీయం చేయాలనుకున్న బాబు అండ్ కోకు ఈ హాట్ హాట్ కామెంట్స్ సరిపోతాయా. ఇంకా కావాలా…