హ‌త్య‌కేసులోనూ చంద్ర‌బాబుది కుల‌రొచ్చు రాజ‌కీయ‌మే!

ఒక మ‌నిషి ప్రాణం తీశారు. అవ‌త‌ల మాన‌వాళినే ముప్పులోకి నెట్టిన వైర‌స్ విజృంభిస్తున్న ద‌శ‌లో కూడా కాస్తైన మాన‌వ‌త్వం లేకుండా హ‌త్య చేశారంటే ఎంత రాక్ష‌స‌త్వంగా ఉండాలి! ఎవడిని వాడు కాపాడుకోవాల్సిన స‌మ‌యంలో ఇంకో…

ఒక మ‌నిషి ప్రాణం తీశారు. అవ‌త‌ల మాన‌వాళినే ముప్పులోకి నెట్టిన వైర‌స్ విజృంభిస్తున్న ద‌శ‌లో కూడా కాస్తైన మాన‌వ‌త్వం లేకుండా హ‌త్య చేశారంటే ఎంత రాక్ష‌స‌త్వంగా ఉండాలి! ఎవడిని వాడు కాపాడుకోవాల్సిన స‌మ‌యంలో ఇంకో మ‌నిషిని హ‌త్య చేయాలంటే.. అది కూడా రాజ‌కీయ కార‌ణాల‌తోన‌ట‌! అంత‌జేసీ వాళ్లు చంపింది ఒక మున్సిప‌ల్ వార్డు స్థాయి నేత‌ను! ఈ హ‌త్య‌పై విచార‌ణ మొద‌లుపెడితే, రాజ‌కీయ కార‌ణాలే హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని, నిందితుల‌ను అరెస్టు చేసిన‌ట్టుగా పోలీసులు ప్ర‌క‌టించారు.

దొరికిన నిందితులు కొల్లు ర‌వీంద్ర పేరును ప్ర‌స్తావించార‌ని కృష్ణా జిల్లా ఎస్పీ ప్ర‌క‌టించారు. హ‌త్య చేసి రండి.. కాపాడుకుంటానంటూ ఆ మాజీ మంత్రి క‌మ్ తెలుగుదేశం నేత త‌మ‌కు హామీ ఇచ్చార‌ని, అందుకే తాము ఆ హ‌త్య‌కు ఒడిగ‌ట్టిన‌ట్టుగా నిందితులు చెప్పార‌ట‌.

హ‌త్య‌ల్లో పాత్ర‌ధారుల‌ది ఎంత వాటా ఉంటుందో, సూత్ర‌ధారుల‌ది -ప్రోత్సాహ‌కారుల‌ది కూడా అంతే వాటా ఉంటుంది. ఫ‌లానా హ‌త్య వెనుక ఫలానా వారి ప్రోత్సాహం ఉందనే వార్త‌లు త‌ర‌చూ వస్తుంటాయి.

హ‌త్య చేసిన వారినే కాకుండా సూత్ర‌ధారుల‌కు కూడా శిక్ష‌లు ప‌డుతూ ఉంటాయి. ఈ నేప‌థ్యంలో కొల్లు ర‌వీంద్ర‌పై హ‌తుడి కుటుంబీకులు ఫిర్యాదులు చేశారు. నిందితులు ఇచ్చిన స‌మాచారం ఆధారంగానే మాజీ మంత్రిని అరెస్టు చేసిన‌ట్టుగా పోలీసులు ప్ర‌క‌టించారు.

ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. ఆయ‌న స్పంద‌న ఆయ‌న స్టైల్లోనే ఉంది. య‌థారితిన అరెస్టైన నేత కులాన్ని చంద్ర‌బాబునాయుడు స్పందించారు. ఆయ‌న బీసీ అని, ఇదంతా బీసీల‌పై దాడి అని చంద్ర‌బాబు నాయుడు త‌న కుల రొచ్చు ప్ర‌క‌ట‌న చేశారు.

150 కోట్ల రూపాయ‌ల భారీ అవినీతి కేసులో అరెస్టైన నేత విష‌యంలోనూ కుల రొచ్చు ప్ర‌క‌ట‌నే, హ‌త్య కేసులో అరెస్టైన నేత విష‌యంలోనూ అదే ప్ర‌క‌ట‌నే.. చంద్ర‌బాబు రాజ‌కీయం అలానే ఉంటుందని స్ప‌ష్టం అవుతోంది. 

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిని అరెస్టు చేస్తే రెడ్ల మీద దాడి అని అన‌లేదు. ఎందుకంటే అలా అంటే  టీడీపీకి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఉండ‌వు. అదే వేరే నేత‌ల విష‌యంలో మాత్రం కుల రొచ్చును చంద్ర‌బాబు క‌దిలిస్తారు. ఆ కంపు లో త‌న ఇంపును  వెదుక్కొనే ప్ర‌య‌త్నం చేస్తారు. అయితే చంద్ర‌బాబు నాయుడు అప్ డేట్ కాలేదేమో కానీ, జ‌నాలు అప్ డేట్ అయ్యారు.

అవినీతి కేసులు, హ‌త్య కేసుల్లోనూ కులం అన‌గానే జ‌నాలు ఎగేసుకొస్తార‌నే భ్ర‌మ‌లోనే చంద్ర‌బాబు నాయుడు క‌నిపిస్తూ ఉన్నారు. ఆయ‌న ఇంకా 1995 నాటి రాజ‌కీయంలోనే ఆగిపోయిన‌ట్టున్నార‌ని పరిశీల‌కులు అంటున్నారు.

ఇక నుంచి నో లంచం నో దళారీ

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు