చింతమనేని.. జైల్లోనే నాలుగోసారి అరెస్ట్!

ఒక్క కేసులో అరెస్టును తప్పించుకోవడానికి పరార్ అయ్యారాయన. అధికారంలో ఉన్నప్పుడేమో తనకు మించిన వాళ్లు లేరన్నట్టుగా విర్రవీగి.. అధికారం కోల్పోగానే పరార్ కావడం తెలుగుదేశం పార్టీ వాళ్లకే సాధ్యం అయ్యే పనిలాగుంది. ఒక మాజీ…

ఒక్క కేసులో అరెస్టును తప్పించుకోవడానికి పరార్ అయ్యారాయన. అధికారంలో ఉన్నప్పుడేమో తనకు మించిన వాళ్లు లేరన్నట్టుగా విర్రవీగి.. అధికారం కోల్పోగానే పరార్ కావడం తెలుగుదేశం పార్టీ వాళ్లకే సాధ్యం అయ్యే పనిలాగుంది. ఒక మాజీ ఎమ్మెల్యే, రాజకీయ నేత.. పరార్ కావడం అనేది బహువింత. అలాంటి చింతమనేని ప్రభాకర్ చివరకు మాత్రం లొంగిపోక తప్పలేదు.

లొంగిపోలేదు.. పోలీసులే ఆయన ఇంటికి వచ్చి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇప్పటికే ఆయన రిమాండ్ లో ఉండబట్టి పక్షంరోజులు దాటాయి. విశేషం ఏమిటంటే.. చింతమనేని అక్కడే అరెస్టు అవుతున్నారు. అక్కడ నుంచినే మరో కేసులో రిమాండ్ లో కొనసాగుతూ ఉన్నారు. ఒకటా రెండా.. గత ఇరవై యేళ్లలో చింతమనేని ప్రభాకర్ పై నమోదైన కేసులు యాభైకి పైనే అని పోలీసుల గణాంకాలు చెబుతూ ఉన్నాయి. వాటిల్లో కొన్ని శిక్షపడిన నేరాలు కూడా ఉన్నాయి.

నాటి మంత్రి వట్టి వసంతకుమార్ పై చింతమనేని దాడి చేసిన వ్యవహారంలో రెండేళ్ల జైలు శిక్ష కూడా పడింది. ఆ శిక్ష విషయంలో పై కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు చింతమనేని. ఇక పెండింగ్ కేసుల్లో చింతమనేని పోలీసులు స్టేషన్లోనే అరెస్టు చేస్తున్నారట. ఒక్కో కేసులో ఆయన అరెస్టులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికి చింతమనేని నాలుగు సార్లు అరెస్టు అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వచ్చేనెల తొమ్మిది వరకూ రిమాండ్ విధించింది కోర్టు. నాలుగో అరెస్టుతో ఆయన రిమాండ్ కాలం మరింత పొడిగించబడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్తున్నా.. సైరా డైరెక్టర్