వైసీపీ సర్కార్ సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సంగతి విధితమే. ఎక్కడ లేని నిధులను తీసుకువచ్చి మరీ పేదలకు మేలు చేయాలని ఓ వైపు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న క్రుషిని ఎవరూ తప్పుపట్టలేరు కూడా. అందుకు అమ్మ ఒడి పధకం అచ్చమైన ఉదాహరణ.
దీనిని ప్రకటించినపుడు జగన్ ఏం చేస్తారులే అని అనుకున్న వారే ఇపుడు ఎలా చేయగలిగారో అని ఆశ్చర్యానందాలు ప్రకటిస్తున్నారు. దటీజ్ జగన్ అన్నట్లుగా సీఎం దూకుడుగా ముందుకుపోతున్నారు. జగన్ వరకూ తీసుకుంటే ప్రతీ పధకం పేదల ముంగింటికి చేరాలన్నది తపన.
అందుకోసం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా ప్రతీ ఇంటికీ పధకాలను అందించే కార్యక్రమమూ చేపట్టారు. మరి ఈ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో అమలవుతున్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది. కానీ వారు ఆ విధంగా స్పందిస్తున్నారా అంటే లేదు లేదంటున్నారు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు.
విశాఖ ఏజెన్సీలొని చితపల్లి, జీకే వీధి మండలాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగినా కూడా వైసీపీ ప్రజా ప్రతినిధుల్లో చలనం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ పధకం కోసం గిరిజన లబ్దిదారులకు ప్రభుత్వం అందించే సొమ్ముని ఏకంగా అక్కడ అధికారులు తన వ్యక్తిగత ఖాతాల్లోకి, అలాగే, తమ బంధువులు, స్నేహితుల ఖాతాల్లోకి మళ్ళించుకున్నా అడిగే నాధుడు లేకుండా పోయారని ఆయన అంటున్నారు.
ఈ మాజీ మంత్రి వైసీపీ సర్కార్ పనితీరు భేష్ అంటూనే ప్రజాప్రతినిధులు ఇలా పట్టనట్లుగా ఉంటే జరిగేవి కుంభకోణాలేనని అని ఏకిపారేస్తున్నారు. మరి పాడేరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మి మీదనే ఆయన ఈ కామెంట్స్ చేశారనుకోవాలి. అలాగే అరకు ఎమ్మెల్యేగా కూడా రాజకీయాలకు కొత్త అయిన చెట్టి ఫల్గుణ గెలిచారు. భారీ మెజారిటీతో గెలిచిన వీరు బాలరాజు విమర్శలతోనైనా అలెర్ట్ అవుతారా మరి.