కలెక్టర్ గారూ.. శభాష్ సారూ..

జిల్లాకు ఆయన పెద్ద. విస్తృతమైన అధికారాలు కలిగిన అత్యున్నత అధికారి. ఆయనను చూడడమే వరం అనుకునే జనం ఉంటారు. అలాంటి కలెక్టర్ తన చాంబర్ దాటి జనాల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకోవడం ఎపుడూ అభినందించతగిన…

జిల్లాకు ఆయన పెద్ద. విస్తృతమైన అధికారాలు కలిగిన అత్యున్నత అధికారి. ఆయనను చూడడమే వరం అనుకునే జనం ఉంటారు. అలాంటి కలెక్టర్ తన చాంబర్ దాటి జనాల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకోవడం ఎపుడూ అభినందించతగిన విషయమే.

విశాఖ వంటి పెద్ద జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన మల్లికార్జున తనదైన పనితీరుని కనబరుస్తూ ఎప్పటికపుడు ప్రజల మెప్పు పొందుతున్నారు. లేటెస్ట్ గా ఆయన విశాఖ నగర శివారులోని అడవివరంలోని ఒక ఉన్నత పాఠశాలకు వెళ్ళారు.

అక్కడ టాయిలెట్ల పరిస్థితిని కళ్ళారా చూశారు. వెంటనే ఎవరికో పని పురమాయించకుండా తానే చటుక్కున పనిలోకి దిగిపోయారు. టాయిలెట్లను శుభ్రం చేసి భావి పౌరులైన విద్యార్ధులకు చైతన్యం కలిగించారు. మన పని మనం చేసుకోవడమే కాదు, పరిసరాల పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ ఘటనతో కలెక్టర్ చక్కని పాఠం చెప్పారు.

కలెక్టర్ ఈ తీరున స్పందించడం పట్ల విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయులు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన పనిని అంతా ప్రశంసిస్తున్నారు కలెక్టర్ గారూ మీకు శభాష్ సార్ అంటున్నారు.ఇదే తీరున మిగిలిన అధికారులు కూడా ఎక్కడికక్కడ స్పందించినట్లైతే అభివృద్ధి దానంతట అదే సాధ్యపడుతుంది. అదే టైమ్ లో సమస్యలు కూడా వెంటనే పరిష్కారానికి నోచుకుంటాయి.