ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్ పార్టీ అక్కడ కోలుకుందా?

ముందుగా కొన్ని సర్వేలు, అధ్యయనాలు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మహారాష్ట్రలో బీజేపీ  గతంలో కంటే మంచి స్థాయిలో సీట్లను…

ముందుగా కొన్ని సర్వేలు, అధ్యయనాలు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మహారాష్ట్రలో బీజేపీ  గతంలో కంటే మంచి స్థాయిలో సీట్లను సాధిస్తుందని అంచనా వేశాయి. హర్యానాలో అయితే కాంగ్రెస్ చిత్తు అవుతుందని కొన్ని జాతీయ చానళ్లు చెప్పాయి.

అయితే హర్యానాలో నెక్ టు  నెక్ ఫైట్ ఉందని అంటోంది ఇండియాటుడే ఎగ్జిట్ పోల్ సర్వే. తొంభై అసెంబ్లీ సీట్లున్న ఈ రాష్ట్రంలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవన్నట్టుగా ఇండియాటుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ బాగా కోలుకుంటుందని ఈ సర్వే అంచనా వేయడం గమనార్హం.

భారతీయ జనతా పార్టీకి హర్యానాలో ముప్పై రెండు నుంచి నలభై నాలుగు అసెంబ్లీ సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ పార్టీకి ముప్పై నుంచి నలభై రెండు అసెంబ్లీ సీట్లకు అవకాశం ఉందని ఈ అధ్యయనం అంటోంది. మరో పార్టీ జేజేపీకి ఆరు నుంచి పది సీట్లు దక్కుతాయని ఇండియా టుడే అంచనా వేసింది. ఇలా  ఒకరకంగా హంగ్ తరహా ఫలితాలు రావొచ్చని ఆ సంస్థ పేర్కొంది.

ఐదేళ్ల కిందట లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది హర్యానాలోనే. అప్పుడు కేవలం పది సీట్లకు పరిమితం అయ్యి అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఐదేళ్లు గడిచే సరికి.. కాంగ్రెస్ పార్టీ పది నుంచి నలభై సీట్ల వరకూ వస్తే.. కోలుకోవడం మొదలైనట్టేనేమో! ఏదేమైనా అసలు ఫలితాలు రేపు వెల్లడి కాబోతూ ఉన్నాయి.

జగన్ పై జేసీ కోపం.. రీజన్ అదే!