కరోనాపై పోరు.. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

కరోనా కట్టడికి చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఓవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటూనే, మరోవైపు కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా…

కరోనా కట్టడికి చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఓవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటూనే, మరోవైపు కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే టెలి మిడిసిన్, వాట్సాప్ ఛాట్ బాట్ లాంటి వినూత్న సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన జగన్ సర్కార్.. ఇప్పుడు కరోనాపై పోరులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లోనే కరోనా వైద్యపరీక్షలు చేయబోతున్నారు.

అవును.. అనుమానిత రోగుల్ని ఇకపై ఐసొలేషన్ వార్డులకు తీసుకెళ్లరు. ఇంట్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. టెస్టుల్ని కూడా ఉచితంగా నిర్వహిస్తారు. పాజిటివ్ అని తేలిన తర్వాత మాత్రమే ఐసొలేషన్ వార్డులకు తరలిస్తారు. అయితే టెస్టులు పూర్తయి, ఫలితాలు వచ్చేంత వరకు మాత్రం అనుమానితులంతా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలి.

తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడే వారు ఎవరైనా ఈ సేవలు పొందవచ్చని.. ఒకవేళ కరోనా కాదని నిర్థారణ అయితే.. సాధారణం మందులు కూడా అక్కడికక్కడే వైద్యులు అందిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మరింత మంది వైద్య సిబ్బందిని తీసుకునేందుకు 2 రోజుల కిందట నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

కరోనా కంటే కరోనా వల్ల ఏర్పడే అసౌకర్యాలే ఎక్కువ. కరోనాతో కొందరు మాత్రమే బాధపడితే.. లాక్ డౌన్ వల్ల సామాన్యులంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందుల్ని తొలిగించేందుకు పేదలకు రేషన్ కార్డు లేకపోయినా ఉచితంగా బియ్యం అందిస్తోంది ప్రభుత్వం. అక్కడికక్కడే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయించేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా అందించాల్సిన తొలి విడత మాస్కులు కూడా రేపు రాబోతున్నాయి.

ఇలా రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం కరోనా వల్ల, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది జగన్ సర్కార్.  

రైతు బావుంటేనే మనం బాగుంటాము

చిరు అడుగుజాడల్లో హీరో శ్రీకాంత్