ఇదేందిర‌య్యా…బీజేపీ పాలిత రాష్ట్రంలో దారుణం

ఎక్క‌డైనా రౌడీ మూక‌ల‌పై పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డం చూశాం. కానీ ఇందుకు విరుద్ధంగా పోలీసుల‌పై రౌడీ మూక‌లు కాల్పులు జ‌ర‌ప‌డ‌మే కాదు…వాళ్ల ప్రాణాలు కూడా తీశారు. ఈ ఘోరం బీజేపీ అధికారం చెలాయిస్తున్న అతిపెద్ద…

ఎక్క‌డైనా రౌడీ మూక‌ల‌పై పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డం చూశాం. కానీ ఇందుకు విరుద్ధంగా పోలీసుల‌పై రౌడీ మూక‌లు కాల్పులు జ‌ర‌ప‌డ‌మే కాదు…వాళ్ల ప్రాణాలు కూడా తీశారు. ఈ ఘోరం బీజేపీ అధికారం చెలాయిస్తున్న అతిపెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకొంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వికాస్ దూబే క‌ర‌డు గ‌ట్టిన రౌడీ షీట‌ర్‌. అత‌ను 60 కేసుల్లో నిందితుడ‌ని స‌మాచారం. అత‌న్ని ఎలాగైనా అరెస్ట్ చేసి  శిక్షించాల‌ని ఆ రాష్ట్ర పోలీసులు గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు. అత‌ను బికారు అనే గ్రామంలో త‌ల‌దాచుకున్నాడ‌ని పోలీసుల‌కు స‌మాచారం అందింది.

డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ దేవెందర్ మిశ్రా ఆధర్వంలోని పోలీసుల బృందం బికారు గ్రామాన్ని శుక్రవారం తెల్లవారుజామున చుట్టుముట్టింది. ప్ర‌తి ఇంటిని పోలీసులు జ‌ల్లెడ ప‌ట్ట‌డం స్టార్ట్ చేశారు. ఈ లోపు వికాస్ దూబే అనుచ‌రుల నుంచి ఊహించ‌ని విధంగా కాల్పులు ఎదుర‌య్యాయి.  

దుండ‌గుల కాల్పుల్లో డిప్యూటీ ఎస్పీ దేవెంద‌ర్ స‌హా ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. మరికొందరు గాయాల‌తో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.  ఈ ఘ‌ట‌న‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ దిగ్ర్బాంతి వ్య‌క్తం చేశాడు.

ఉషారాణికి అండగా మంత్రి అనిల్

అల్లు అర్జున్ మాయ చేసేస్తాడు