భారతీయ జనతా పార్టీలో రచ్చ స్టార్ట్!

కర్ణాటకలో బోటాబోటీ మెజారిటీతో ప్రభుత్వాన్నిఅయితే ఏర్పాటు చేశారు కానీ మంత్రి పదవుల విషయంలో అంతర్గత రాజకీయాన్ని సరి చేసుకోవడం భారతీయ జనతా పార్టీకి కూడా అంత తేలికగా కనిపించడం లేదు. ఏ మంత్రి పదవుల…

కర్ణాటకలో బోటాబోటీ మెజారిటీతో ప్రభుత్వాన్నిఅయితే ఏర్పాటు చేశారు కానీ మంత్రి పదవుల విషయంలో అంతర్గత రాజకీయాన్ని సరి చేసుకోవడం భారతీయ జనతా పార్టీకి కూడా అంత తేలికగా కనిపించడం లేదు. ఏ మంత్రి పదవుల విషయంలో అయితే లొల్లి రేగి కాంగ్రెస్-జేడీఎస్ ల ప్రభుత్వం పడిపోయిందో అవే పదవుల విషయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో అసంతృప్తులు తయారయ్యారు. యడియూరప్ప కేబినెట్ ను అలా విస్తరించారో లేదో ఇంతలోనే పదవుల దక్కనివారు అసంతృప్త స్వరాలను వినిపిస్తూ ఉన్నారని తెలుస్తోంది.

కేబినెట్ లో బెర్తును ఆశించి భంగపడినవారు అప్పుడే అసహనాన్ని చాటుతున్నారట. తమకు మంత్రిపదవి దక్కనందుకు వారు బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తంచేస్తూ ఉన్నారని సమాచారం. అయితే యడియూరప్ప మొత్తం కేబినెట్ ను భర్తీ చేయలేదు. కొన్ని పదవులను ఖాళీగానే ఉంచారు. ఈ నేపథ్యంలో వాటిని చూపి వారిని చల్లార్చే ప్రయత్నం జరుగుతోందని సమాచారం.

ఇప్పుడు కాకపోయినా ముందు ముందు అవకాశాలు ఉంటాయని వారిని ఊరడిస్తూ ఉన్నారట. అయినా కొందరు అసహనం వ్యక్తం చేస్తుండే యడియూరప్ప వారికి అధిష్టానం బూచిని చూపిస్తున్నారని సమాచారం. చెప్పినట్టు వినకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటూ వారిని బెదిరించినంత పని చేస్తున్నారట కర్ణాటక సీఎం. అధిష్టానం పేరు చెబుతుండే సరికి కమలం పార్టీ అసంతృప్తులు కూడా మారు మాట్లాడలేకపోతున్నారనేది కర్ణాటక టాక్!

ముడుపులకు ఆశపడితే మూడినట్టే!