తిరుమలలొ ఎపుడైనా తలనీలాలు ఇచ్చావా బాబూ?

అపర హిందువుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్న చంద్రబాబు  మీద వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు. హిందుత్వ అజెండా పట్టుకున్న బాబు దూకుడుకు లాజిక్ పాయింట్ తీసి మరీ  బ్రేక్…

అపర హిందువుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్న చంద్రబాబు  మీద వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు. హిందుత్వ అజెండా పట్టుకున్న బాబు దూకుడుకు లాజిక్ పాయింట్ తీసి మరీ  బ్రేక్ వేశారు.

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నపుడు ఎపుడైనా చంద్రబాబు తలనీలాలు సమర్పించారా అంటూ కరెక్ట్ పాయింటే లేవదీశారు. బాబు రాష్ట్రంలో మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.

ఇక ఏపీలో బీజేపీ వంటి పార్టీలు ట్రాప్ లో పడుతున్నాయరంటూ మంత్రి అవంతి శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. ఏపీలో లేని పోని గొడవలు చేయడానికి మత రాజకీయాలకు బాబు తెర తీశారని కూడా అవంతి ఆరోపించారు. చంద్రబాబు వైసీపీ మీద క్రిస్టియానిటీ ముద్ర వేయడానికి చూస్తున్నారని కూడా నిందించారు.

ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా మతాల మీద చర్చ జరగడానికి బాబు వైఖరి కారణమని ఆయన అన్నారు. చంద్రబాబు పొలిటికల్ ట్రాప్ లో బీజేపీ పడకూడదని మంత్రి సలహా ఇచ్చారు. కానీ ఇపుడు ఏపీలో వాతావరణం చూస్తూంటే ఈ రచ్చ ఇంతటితో ఆగేలా లేదని అంటున్నారు.

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

దేవుడి పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు