దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. దిశని కాల్చిన చోటే నిందితులని ఎన్కౌంటర్ చేయడంతో తమ బిడ్డకు తగిన న్యాయం జరిగిందని, నిందితులకు తగిన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఎన్కౌంటర్ జరిగిన సమాచారం తెలుసుకుని … సంఘటనా స్థలానికి స్థానికులు భారీగా తరలి వస్తున్నారు. చటాన్‌పల్లి బ్రిడ్జ్ వద్దకు చేరుకున్న స్థానికులు…పోలీసులు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… నిందితులను ఎన్కౌంటర్ చేసి మంచి పని చేశారంటూ పోలీసులు, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల అభిప్రాయాన్నే పోలీసులు అమలు చేశారని అభిప్రాయపడ్డారు. సీఎం జిందాబాద్, పోలీసులు జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.