సినిమా డైలాగ్‌లు వ‌ద్దు ప‌వ‌న్‌

సినిమా షూటింగ్ నుంచి నేరుగా ప్రెస్‌మీట్‌కు వ‌చ్చిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌…విలేక‌రుల‌తో కూడా సినిమా డైలాగ్‌లు చెబుతున్నాడు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు వేసిన వాళ్లు ధైర్యంగా ఉండాల‌ని, దెబ్బ‌లు తిన్నా బ‌లంగా నిల‌బ‌డాల‌ని ఆయ‌న…

సినిమా షూటింగ్ నుంచి నేరుగా ప్రెస్‌మీట్‌కు వ‌చ్చిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌…విలేక‌రుల‌తో కూడా సినిమా డైలాగ్‌లు చెబుతున్నాడు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు వేసిన వాళ్లు ధైర్యంగా ఉండాల‌ని, దెబ్బ‌లు తిన్నా బ‌లంగా నిల‌బ‌డాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి గురువారం విజ‌య‌వాడ‌లో బీజేపీ-జ‌న‌సేన ఉమ్మ‌డిగా రూపొందించిన విజ‌న్ డాక్యుమెంట్‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌తో ఇత‌ర బీజేపీ, జ‌న‌సేన నేత‌ల‌తో క‌లిసి ప‌వ‌న్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ ప్ర‌స్తుతం రాష్ట్రంలో చాలాచోట్ల నామినేష‌న్లు వేయ‌లేని ప‌రిస్థితులున్నాయ‌న్నారు. అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేయ‌లేని విధంగా వైసీపీ బెదిరింపుల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని.. దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బెదిరింపులు, దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వైసీపీ ఇలాంటి దుర్మార్గ విధానాల‌తో ప్ర‌జ‌ల హృదయాలను గెలవలేరని చెప్పుకొచ్చారు.  ప్రతి జనసేన, బీజేపీ అభ్యర్థి.. ధైర్యంగా ఉండి.. బెదిరింపులకు లొంగొద్దన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు.  151 మంది సభ్యులున్న వైసీపీకి ఇంత భయమెందుకన్నారు. ఇక ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు.

వైసీపీ రౌడీయిజానికి ముకుతాడు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. ఈ రోజు ప్రజలు కదిలిరావలసిన రోజన్నారు. మ‌రి రాష్ట్రంలో ఇంత దుర్మార్గ‌మైన విధానాలు న‌డుస్తోంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీరిగ్గా షూటింగ్‌ల్లో మునిగి తేల‌డం న్యాయ‌మా? ఏదో ఇది కూడా ఓ షూటింగ్ మాదిరి భావించి…అలా మీడియా ముందు ఓ ఫోజు ఇచ్చి….ఆ త‌ర్వాత ప‌త్తా లేకుండా పోవ‌డం బాధ్య‌త‌గ‌ల ప్ర‌తిప‌క్ష పార్టీ నేత ల‌క్ష‌ణ‌మేనా అని జ‌న‌సేన-బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

నిజంగా ప్ర‌జ‌ల క‌ష్టాల‌పై ప‌వ‌న్‌కు చిత్తశుద్ధి వుంటే త‌క్ష‌ణం షూటింగ్‌లు మానుకొని, వాళ్ల వ‌ద్దకు వెళ్లి భ‌రోసా క‌ల్పించే వార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇంకా చెప్పాలంటే స్వ‌యాన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణే అధికార వైసీపీకి భ‌య‌ప‌డి…బీజేపీ పంచ‌న చేరార‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. మ‌రెందుకు ఈ సినిమా డైలాగ్‌ల‌ని సొంత పార్టీతో పాటు మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్నిస్తుండ‌టం గ‌మ‌నార్హం. 

నువ్వొస్తావా? నన్ను రమ్మంటావా?