పచ్చ పచ్చని విశాఖ

విశాఖ అంటేనే పచ్చదనం, ఎంతైన కొండలు దీవిస్తున్నట్లుగా ఉంటాయి. ఎదురుగా పదహారేళ్ళ పడుచులా  కడలి పరవళ్ళు తొక్కుతూ అలరిస్తుంది నిజంగా బ్యూటీ ఆఫ్ డెస్టనీ అంటే విశాఖే. Advertisement విశాఖ పచ్చదనాన్ని అందాన్ని చూసి…

విశాఖ అంటేనే పచ్చదనం, ఎంతైన కొండలు దీవిస్తున్నట్లుగా ఉంటాయి. ఎదురుగా పదహారేళ్ళ పడుచులా  కడలి పరవళ్ళు తొక్కుతూ అలరిస్తుంది నిజంగా బ్యూటీ ఆఫ్ డెస్టనీ అంటే విశాఖే.

విశాఖ పచ్చదనాన్ని అందాన్ని చూసి అసూయ పెంచుకుని హుదూద్ తుఫాన్ కసిగా విరుచుకుపడినా కూడా మళ్ళీ తన పచ్చదనాన్ని పదింతలు సంపాదించుకుని తలెత్తుకున్న నగరం విశాఖ.

అటువంటి విశాఖ సాగరతీరం అంతా పచ్చగా ఉంటే పట్ట పగలే పండు వెన్నెలలు కాయవా. విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలీ తీరం వరకూ ఉన్న ప్రాంతాన్ని అంతా మొత్తం గ్రీనరీతో నింపేస్తామని,  ప్రకృతి ప్రేమికుల కలలధామంగా చేస్తామని రాజ్యసభ సభ్యుడు ప్రకటించడం నిజంగా హర్షణీయమే.

అందాల విశాఖకు ఇది అదనపు ఆభరణం అవుతుందని అంతా అంటున్నారు. ఇక గ్రీన్ విశాఖ, క్లీన్ విశాఖ తమ టార్గెట్ అంటూ విజయసాయిరెడ్డి విశాఖ విజన్ ని వినిపిస్తున్నారు.  భవిష్యత్తు తరాల కోసం ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలతో ఈ మెగా సిటీని ధగధగలాడేలా  చక్కని కార్యాచరణకు ముఖ్యమంత్రి జగన్ రూపకల్పన  చేస్తున్నారని చెప్పారు. 

మొత్తానికి విశాఖ అంటే పచ్చపచ్చని, వెచ్చవెచ్చని లోగిలి అని ఎంపీ విజయసాయిరెడ్డి అద్భుతమైన హామీనే ఇచ్చేశారు.

యూట్యూబ్ రిపోర్టర్ల పరిస్థితి ఏంటి..?