కరోనా టెస్టులు తక్కువగానే చేస్తాం- మంత్రి ఈటెల

తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్య తక్కువగా ఉందనే విమర్శను తిప్పికొట్టారు మంత్రి ఈటెల రాజేందర్. 80-90 పాజిటివ్ కేసులున్నప్పుడు 800-900 రేంజ్ లో పరీక్షలు చేస్తామని.. 8-9 కేసులు నమోదవుతున్నప్పుడు వేల సంఖ్యలో పరీక్షలు…

తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్య తక్కువగా ఉందనే విమర్శను తిప్పికొట్టారు మంత్రి ఈటెల రాజేందర్. 80-90 పాజిటివ్ కేసులున్నప్పుడు 800-900 రేంజ్ లో పరీక్షలు చేస్తామని.. 8-9 కేసులు నమోదవుతున్నప్పుడు వేల సంఖ్యలో పరీక్షలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

“భారత వైద్యపరిశోధన మండలి నిబంధనల ప్రకారమే కరోనా టెస్టులు చేస్తున్నాం. ఎవరికి పడితే వాళ్లకు చేయడం లేదు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే టెస్టులు చేస్తున్నాం. ఎక్కడైతే పాజిటివ్ కేసులొస్తున్నాయో.. వాళ్లలో డైరక్ట్ కాంటాక్ట్ ఉన్నవాళ్లలో లక్షణాలు కనిపించిన వాళ్లకే టెస్టులు చేస్తున్నాం. పాజిటివ్ కేసు వచ్చిన ఇళ్లలో కరోనా లక్షణాలు లేని వాళ్లను కేవలం క్వారంటైన్ లో ఉంచుతున్నాం. టెస్టులు తగ్గించి చేస్తున్నామనే భావన పూర్తిగా తప్పు. ఇదే విషయాన్ని ఈరోజు కేంద్రానికి చెప్పాం. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పుడు పరీక్షలు ఆటోమేటిగ్గా తగ్గుతాయి. వేల సంఖ్యలో  చేయాల్సిన అవసరం లేదు.”

ఇలా తెలంగాణలో తక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తున్న అంశాన్ని సమర్థించారు ఈటెల. తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్నాంటూ ఆరోపించడం సరికాదన్నారు. ఓవైపు జిల్లాలన్నీ కరోనా రహిత ప్రాంతాలుగా మారుతుంటే.. వందల సంఖ్యలో పరీక్షలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని.. కాబట్టి వాటిని కూడా గ్రీన్ జోన్లుగా ప్రకటించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు మంత్రి.

మరోవైపు సూర్యాపేట, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, కాబట్టి వాటిని రెడ్ జోన్ల నుంచి ఆరెంజ్ జోన్లుగా కూడా మార్చమని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. కేంద్రం 14 జిల్లాల్ని గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తే.. తెలంగాణలో 89శాతం భూభాగం కరోనా రహిత ప్రాంతంగా ఉంటుందన్నారు ఈటెల.

ప్రస్తుతం రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలు మాత్రమే రెడ్ జోన్లలో ఉన్నాయని స్పష్టంచేశారు. ఇక ఇవాళ్టి కేసుల విషయానికొస్తే, సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో కొత్తగా 10 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఈ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిథిలోనేనివే. వీటితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1132కు చేరింది. వీళ్లనుంచి 782 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఒక్కరోజే 34 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. 

జగన్ ని అభినందిస్తున్నా