ఒకవైపు కోవిడ్-19 సోకడమే పెద్ద విపత్తుగా మారింది. ఇలాంటి సమయంలో ఆ మహమ్మారితో ఇబ్బంది పడుతున్న పేషెంట్లను ప్రమాదాలు కూడా వెన్నాడుతూ ఉండటం గమనార్హం. ఇటీవలే గుజరాత్ లో కోవిడ్ -19 పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందిస్తున్న ఒక కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా విజయవాడలో కూడా కోవిడ్-19 కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం విషాదకరం. ఇలా కోవిడ్ -19 పేషెంట్లను అగ్నిప్రమాదాలు వెన్నాడటం బాధాకరంగా మారింది.
అహ్మదాబాద్ లోని కోవిడ్-19 కేర్ సెంటర్లో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. తెల్లవారుఝామున ఒక హాస్పిటల్ లో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం మృతుల బంధువులకు తీరని వేదనను మిగిల్చింది. ఇంతలోనే విజయవాడలో కోవిడ్-19 పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందిస్తున్న ఒక హోటల్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలోనూ ఏడు మంది మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు మొదలయ్యాయని, అవి హోటల్ లో వ్యాపించడంతో పొగ చుట్టుకుందని, పొగతో ఊపిరాడకే పేషెంట్లో మరణించి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. కోవిడ్-19 సోకడమే పెద్ద మహమ్మారి బారిన పడటం అనుకుంటే, అలాంటి పేషెంట్లనే అగ్నిప్రమాదాలూ వెన్నాడుతున్న వార్తలు బాధాకరంగా మారాయి.