నిజమే.. జగన్ కు అది చేతకాదు

వరదల్లో సాయం చేయడం చేతకాని ముఖ్యమంత్రి అంటూ జగన్ ని తిట్టిపోస్తున్నారు నారా లోకేష్. ముఖ్యమంత్రి బైటకు రాలేదు, ముఖ్యమంత్రి జనాల్లోకి వెళ్లలేదు అని నసుగుతున్నారు. అసలు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో లోకేష్ కి…

వరదల్లో సాయం చేయడం చేతకాని ముఖ్యమంత్రి అంటూ జగన్ ని తిట్టిపోస్తున్నారు నారా లోకేష్. ముఖ్యమంత్రి బైటకు రాలేదు, ముఖ్యమంత్రి జనాల్లోకి వెళ్లలేదు అని నసుగుతున్నారు. అసలు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో లోకేష్ కి తెలుసా..? పోనీ ముఖ్యమంత్రి బాధ్యత ఏంటో చినబాబుకి కానీ, చంద్రబాబుకి కానీ తెలుసా..?

కేవలం ప్రచార యావతో గతంలో తిత్లి, ఫొణి తుపానులను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ఎంత ప్రచారం చేసుకున్నారో జనాలకి తెలియదనుకుంటున్నారా? అసలు చంద్రబాబు ప్రచారం వల్లే విశాఖకు పెట్టుబడులు రాకుండా పోయాయనే వాదన కూడా ఉంది. 

కేవలం కేంద్రం సాయం కోసమే.. తుపానులతో విశాఖ అతలాకుతలం అయిందని చంద్రబాబు ఫొటోలతో ప్రచారం చేసుకున్నారు. కేంద్రం సాయం అందింది కానీ.. విశాఖ ఇమేజ్ మట్టిలో కలిసిపోయింది. పోనీ ఆ సాయంతో స్థానికులకు ఉపశమనం కలిగిందా అంటే అదీ లేదు. కేవలం బాబు ప్రచారం కోసమే అది ఖర్చు చేశారు.

ఉత్తరాంధ్రకు వరుసగా తుపాన్లు వచ్చినప్పుడు సాయం చేయడం మాట అటుంచి, ఎలా ప్రచారం చేసుకున్నారో అందరికీ తెలిసిందే. అదే టైమ్ లో పాదయాత్రలో ఉన్న జగన్.. తన యాత్రకు మధ్యలో విరామం ఇచ్చి మరి, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ విషయాల్ని గుర్తుచేస్తే, గతంలో బాబు చేసిన హంగామాను విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో ఓ రైటప్ వైరల్ అవుతోంది. చంద్రబాబు ప్రచార యావను కళ్లకు కడుతోంది.

అవును నిజమే.. జగన్ కు అది చేతకాదు

వరదలొచ్చినప్పుడు ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేసుకోవడం..

ఇళ్లు మునిగిపోతే సెల్ ఫోన్ ఛార్జర్లు పెట్టి హంగామా చేయడం..

తాగడానికి నీళ్లు అని చెప్పి ప్యాకెట్లలో బురదనీరు పోయడం..

చంటిపిల్లలకు పాలు అని చెప్పి నీళ్లపాలు అంటగట్టడం..

అవును నిజమే.. జగన్ కు అది చేతకాదు

వరద బాధిత ప్రాంతాల్ని వదిలేసి పైపైన పర్యటించడం

కంటిచూపుతో తుఫాను అపేశామంటూ పేపర్లలో ప్రకటన ఇచ్చుకోవడం..

శ్రీకాకుళంలో ఇవ్వాల్సిన వరదసాయం రాజమండ్రి బ్లాక్ మార్కెట్లో కనిపించడం…

అవును నిజమే.. జగన్ కు అది చేతకాదు

బాధితుల్లో టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పంటనష్టం అందించడం..

నిరంతర సమీక్షల పేరిట అధికారులకు బీపీలు, హార్ట్ ఎటాక్ లు తెప్పించడం

డాష్ బోర్డ్ అంటూ హంగామా చేసి పబ్బం గడుపుకోవడం..

అవును నిజమే.. జగన్ కు అది చేతకాదు..

ఇలా సాగిన ఈ పోస్టులో ప్రతి అక్షరం అక్షర సత్యం. లోకేష్, చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా ఈ విషయాల్ని గుర్తుచేసుకుంటే, ఈ వరదల సమయంలో జగన్ ను విమర్శించడానికి వాళ్లుకు నోళ్లు రావు. 

ఇంకెన్ని రహస్య జీవోలు, వ్యవహారాలున్నాయో