Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Gossip

ఏబీ మరింతగా ఇరుక్కుపోతారా?

ఏబీ మరింతగా ఇరుక్కుపోతారా?

ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేయడం ఒక కీలక పరిణామం. అది సంచలనం అయింది. తన సస్పెన్షన్ ను సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో పిటిషన్ వేశారు. అయితే ఆ విచారణ సందర్భంగా.. ఆయన మరింతగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోతున్నారా అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. విచారణ సందర్భంగా ఆయన వెల్లడిస్తున్న విషయాలు.. ఆయన పాత్రను మరింతగా ప్రస్ఫుటం చేసే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు.

ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు.. గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సమయంలో కూడా ఆయన తెదేపాకు అనుకూలంగా ఉన్నారంటూ వైకాపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కూడా. జగన్ ప్రభుత్వం రాగానే ఆయనను ఆ బాధ్యతలనుంచి తప్పించారు. తర్వాత కొన్నాళ్లకు సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్ పై ఏబీ క్యాట్ కు వెళ్లారు. తన సస్పెన్షన్ గురించి.. కేంద్రానికి తెలియజేశారా అంటూ ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు.

అప్పట్లో డ్రోన్ ల కొనుగోలుకు సంబంధించి స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ జరిపిన టెండర్ కమిటీ సమావేశంలో పాల్గొనడమే ఏబీని  ఇరికించేలా కనిపిస్తోంది. ఆ టెండరును తన కుమారుడి కంపెనీకి దక్కేలా ఆయన ప్రభావితం చేశారనేది ఆరోపణ. 25 కోట్ల రూపాయల విలువైన కొనుగోళ్లలో నాసిరకం పరికరాలతో కొనుగోలుచేసి అవినీతికి పాల్పడ్డారనేది ఆరోపణ.

అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆ టెండరును రద్దుచేసి, బిల్లుల చెల్లింపు కూడా ఆపేశారు. అయితే ఇప్పుడు ఏబీ మాత్రం.. క్యాట్ ఎదుట.. ఆ టెండరు రద్దయింది గనుక, పరికరాల కొనుగోలు పూర్తి కాలేదు గనుక.. ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లలేదు గనుక.. తన సస్పెన్షన్ తప్పు అని వాదిస్తున్నారు.

అక్రమాలను ప్రభుత్వం గుర్తించి ఆపివేయబట్టి నష్టం రాలేదు గానీ.. గమనించకపోయి ఉంటే నష్టం వాటిల్లేదే కదా.. అక్రమాలు చేసినందుకు శిక్ష పడాలి గానీ.. ఆ అక్రమం పూర్తికాకపోతే.. తప్పు చేసిన వారిని వదిలేస్తే ఎలా? ఏబీ వాదన మాత్రం తాను చేసిన అక్రమం పూర్తి కాలేదు గనుక.. తనను విడిచిపెట్టమని కోరుతున్నట్లుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. క్యాట్ లో పిటిషన్ వేసి.. ఏబీ వెంకటేశ్వరరావు తన నెత్తిమీదికే తెచ్చుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తోంది.

సంక్షేమ పథకాలు రాష్ట్రానికి క్షేమమేనా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?