Advertisement

Advertisement


Home > Politics - Gossip

బీజేపీనే ఠారెత్తించిన బాబుపై మోదీ జగన్నాయుధం

బీజేపీనే ఠారెత్తించిన బాబుపై మోదీ జగన్నాయుధం

2019లో జరిగిన సాధారణ ఎన్నికలు గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నమైనవి. ఓడిపోతారనుకున్న ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌, చంద్రబాబుల్లో బాబే ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఎందుకు ఓడామో తెలియట్లేదని మీడియా ముందు అతివిచారంగా బాబు చెప్పుకున్నారు. బాబు నేడు కుప్పంలో ఓటమి తర్వాత పర్యటనలో జనాల ముందు కూడా అదే కూత కూసారు. విన్నోళ్లు రామ! రామ!! ఎందుకు ఓడారో తెలియనంత అహం, దర్పం బాబుకు నిలువెత్తు కమ్మేసిందని అనుకున్నారు. ఇలా బాబుంటే, ఓడిపోతామనుకున్న మరిద్దరులో ప్రధాని మోదీ ఎందుకు ఎక్కువ సంఖ్యాబలంతో గెలిచామో అని నేటికి అర్ధంకాని పరిస్థితిలో ఉన్నారు. పైగా, నరేంద్రమోడీకి, కేసీఆర్‌కు ఈగెలుపు అంతుపట్టని రహస్యమయ్యింది. గెలిచి తీరుతామనుకున్న రాహూల్‌ గాంధీ, శరద్‌పవార్‌, మమతాబెనర్జీ, మాయావతి, దేవేగౌడలకు ఓటమి ఎదురు కావడం బొత్తిగా అర్ధంకాక రాజీనామా మెరుపులు మెరిపించి, వేయాల్సిన గంతులు చెడామడా వేసారు. మీరు పార్టీకి దూరమైతే మీపార్టీలకు, ఈదేశానికి ఒరిగేదేమీలేదని వెనుక ఉన్న భజన్‌పరుల హితంబుతో ఎవరికివారే సద్దుమణిగారు. పార్టీ దుంపధూళికి కారకుడైన అతిపెద్ద రాజకీయాను భవశాలి చంద్రన్న మాత్రం ఎంతమాత్రం రాజీనామా చేసే తలంపులో ఉండరు.

అందుకు కారణం? ఒక్కసారి రాజీనామా చేస్తానని బాబు నోరుజారితే పొంచున్న ఎన్‌టీఆర్‌ వారసులు మా నాన్నపార్టీ మాదే అంటూ నినాదాలతో దూసుకు వస్తారు. తిరిగి వారి నుంచి పార్టీని లాక్కోవాలంటే చాలా వెన్నుపోట్లు పోడాల్సిందే. పైగా, అప్పుడు ఒక్క ఎన్‌టీఆర్‌కే వెన్నుపోటు. ఇప్పుడు వారసులు పార్టీని దొరకపుచ్చుకున్నారంటే వారి నుంచి పార్టీని తిరిగి పొందడం సాధ్యమయ్యేది కాదు. ఇవన్నీ ముందే ఊహించిన  బాబు రాజీనామా అనేది కలలో కూడా ప్రస్తావించలేదు. ఇప్పుడు బాబు పరిస్థితి అత్యంత ధారుణంగా ఉంది. పార్టీ విషయాలు తర్కించడానికి పార్టీలో ఏఒక్కరు సిద్ధంగా లేరు. పార్టీకి యువరాజు, రేపటి వారసుడు లోకేష్‌కు చెప్పినా, తన బామ్మర్ధి బాలకృష్ణతో గోడు గోడుమన్నా కంఠశోష తప్పితే, వారికి ఏమీ అర్ధంకాదని బాబుకు క్షుణ్ణంగా తెలుసు. పార్టీ పతనానికి బాబు అహంతో కూడిన అవినీతి పాలనే అని పార్టీలో ప్రతిఒక్కరికి తెలుసు. వేలకోట్లు ప్రజలపైకి విశిరేసి గెలిచేస్తామనుకున్న బాబు రాజకీయపతనం అంచుకు చేరిన తీరుతో ఏపీలో టీడీపీ కార్యకర్తలే బాబును ఏపీ జనాలు ఇక మున్ముందు కూడా నమ్మరు అని డిసైడ్‌ అయిపోయారు. గడచిన ఐదేళ్లపాలన ఏ రాష్ట్రంలో, ఏపార్టీ, ఏ సీఎం కూడా చేయని విధంగా అన్నివర్గాల ప్రజలకు చుక్కలు చూపిన వైనం టీడీపీ నేతలు, కార్యకర్తలు తలచుకుని నారాసురపాలనే అని తర్కించుకుంటున్నారు.

ఇప్పట్లో పార్టీ తేరుకునేలా లేదని కూడా తేల్చేసారు. కోరికోరి మోదీతో తగవులు పడిన తీరు. కేసీఆర్‌ను అనుక్షణం గిల్లికజ్జాలు ఇవన్నీ పార్టీకి ఏమేరకు హీనపరచాలో అంతగా చులకన చేసాయని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ క్యాడర్‌లో పార్టీ సమూలంగా భూస్థాపితమయ్యేలా మోదీవలన కీడు సంభవిస్తుందనే భయం పీడిస్తోంది. బాబు అండ్‌కోకి నిద్రపోనియడంలేదు. మోదీని దించేస్తా అంటూ ఎన్నికల్లో బాబు చేసిన భారీ కుట్రలు, తెగిపోయిన టిక్కెట్లు లాంటి 23పార్టీలతో కూటమిగా ఏర్పాటై చేసిన తాటాకు చప్పుళ్లు, కాంగ్రెస్‌తో ఎత్తుగడలు ఇవన్నీ సాక్షాత్తు మోదీని గెలుస్తామనే ఆశలు లేకుండా చేసాయి. పైగా, బీజేపీలో సీనియర్లను మీరే కాబోయే ప్రధాని, ఇక మోదీకి ఇంటికి పంపుదాం అని బాబు కలుసుకుని బొట్టుపెట్టడం వంటివి కేంద్రంలో బీజేపీకి చేష్టలుడిగించాయి. ఎన్నికల ఫలితాలవరకు బీజేపీలో మూలవిరాట్టులకు కూడా గెలుస్తామన్న నమ్మకం బాబు లేకుండా చేసారు. పోలింగ్‌ అయ్యాక 41రోజులు తర్వాత ఫలితాలు వెలువడేంతవరకు మోదీని దుయ్యబట్టుడులోనే బాబు అవిశ్రాంత పోరాటకుడయ్యారు. ఈవీఎమ్‌లు మోదీ ముద్దుబిడ్డలని సైకిల్‌కు ఓటు వేస్తే ఫ్యాన్‌కు ఓటుపడ్డట్టు వీవీప్యాట్‌లలో చూసానని బాబే మీడియాలో పెట్రేగారు. ఇలాంటి దొంగదారి గెలుపులో మోదీ ఉన్నారని దేశమంతా హడావుడి చేసిన తీరు నేడు టీడీపీ క్యాడర్‌కు నాలుక తడారిస్తోంది.

సంఖ్యాబలంతో మోదీ గెలుపు బాబుకు చేష్టలుడిగించాయి. నలుగురు రాజ్యసభ ఎంపీలను బాబు బొట్టుపెట్టి బీజేపీ దారిపట్టించారో, లేక బాబును చీదరించుకుని పార్టీ వదిలిపోయారో బాబుకే తెలియాలి. తను పంపిస్తే మోదీ భయం పూర్తిగా కాకపోయినా కొంతమేరకు తగ్గిందని బాబు తనకు తానేధైర్యం పెంచుకోవచ్చు. కానీ, ఏపీలో కొత్త ప్రభువు జగన్‌ కదలికలు మోదీ భయాన్ని మించి కార్యరూపంలో ఉన్నాయి. బాబు కలలపంట ఏడెనిమిది కోట్ల రూ.ల కట్టడం ప్రజావేదికను కుప్పకూల్చడం బాబు ఒంట్లో నరాలన్నీ మెలిపెట్టేసినట్లయ్యింది. ఆపక్కనే రాజుల కోటను మరపించేలా ఉన్న బాబు నివాసం ఓ అక్రమ కట్టడం అని జగన్‌ సర్కారు తేల్చడం. నోటీసులు గోడకు అంటించడం, రేపోమాపో కుప్పకూలుస్తామనే సంకేతాలు వెలువరించడంతో బాబు అండ్‌కోకి చేష్టలుడిగిపోసాగాయి. బాబు అద్దెఇల్లు అని చెప్పుకుంటున్న బాబు నివాసం కూల్చడం గ్యారెంటీ అని తేలిపోయింది.

జగన్‌ కూల్చడాలతో సరిపెట్టడం లేదు. గతసర్కారు ఐదేళ్లపాలనలో జరిగిన 30శాఖల అవినీతిని ఎండగట్టమని, ఆధారాలతో వెలికి తీయమని ఆ కొత్తమంత్రులను ఎగదోయడం నిత్యకృత్యమయ్యింది. వారు పాతఫైళ్లలో భూతద్దాలతో శోధించడంలో తలమునకలయ్యారు. దీనిపై బాబు మీచేతిలో అధికారం ఉంది. అందుబాటులో ఫైళ్లున్నాయి. నిగ్గుతేల్చండని బయటికి డొల్లమాటలు చెబుతున్నారు. ఏఫైలు ముట్టుకుంటే అందులో కన్పించేది వేలకోట్లు హాంఫట్టే. తొలి అసెంబ్లీలో నీరుమీరు టాపిక్‌ వచ్చేటప్పుడు సంబంధిత కొత్తమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ నీరుచెట్టు అని చెప్పి మొత్తం 18 వేలకోట్లు తినేసారని గర్జనలు చేసారు. అలాగే, పోలవరంలో 16వేల కోట్లు కమీషన్‌ల కోసం 56 వేలకోట్లుకు పెంచేసిన ఘన చరిత్రకారుడు చంద్రబాబే అని నిలదీసారు. ధర్మదీక్ష పేరిట 500 కోట్లు నాకేసిన చంద్రన్న సర్కారు తీరును ఎండగట్టి అసెంబ్లీని దద్దరిల్లించారు. బాబు ఒకటి అనేసి పదికాయడం అనేది బాబు అండ్‌కోకి ఆది నుంచి అలవాటే.

గత సర్కారుపై జగనో లేకుంటే ఢిల్లీలో ఉండే విజయసాయిరెడ్డో కాకుండా మంత్రులందరిని బాబు చేసిన అవినీతిని వెలికి లాగమని జగన్‌ ఎగదోస్తున్నారు. నాసర్కారు అవినీతిలేని పాలనకు కట్టుబడి ఉంది. ఎవరైనా తినేసినట్టు తెలిస్తే మంత్రి పదవిలో సాగనీయను అన్నట్టుగా పదేపదే జగన్‌ చెబుతునే ఉన్నారు. ఇప్పుడు జగన్‌తో బాటు ఆయన మంత్రులు, ఎంఎల్‌ఏలు అవినీతిరహితపాలనే చేస్తాం అంటూ ఎవరి పరిధిల్లో వారు ఆ నినాదాన్ని జనాల్లో విన్పిస్తున్నారు. వింటున్న జనాలు ఔరా! ఇది సాధ్యమేనా? జరిగే పనేనా? చంద్రబాబు మహా అవినీతితో  ఏపీ అంతా తడిసిముద్దయి ఉంది. 3లక్షల 75వేలకోట్లు అవినీతిని చంద్రబాబు ఐదేళ్లపాలనలో చేసి చూపారని సాక్షాత్తు జగన్‌మీడియా అందంగా బుక్కురూపంలో అచ్చేసి అప్పటి ప్రధాని మోదీకి కేంద్రమంత్రులకు తలా ఒకటి చేతిలో పెట్టింది. బాబు అవినీతి గురించి వివరించే ఆబుక్కును పనులు మానుకుని కేంద్ర మంత్రులు చదివేసి నోళ్లుబార్లా తెరిచారు.

బాబుది వెన్నుపోట్ల సంస్కృతే అనుకుంటే తప్పు. అక్రమధనపర్వతం అని డిసైడ్‌ అయ్యారు. ఆబుక్కులో కొన్నింటిని మోదీ ఎన్నికల్లో ఏపీ పర్యటన సభల్లో ఉటంకించి విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్‌ తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడానికి మోదీని కలిసారు. అత్యంత ఆప్యాయతను మోదీ జగన్‌పై కనబరిచారు. హోదా ఎందుకు ఏపీకి ఇవ్వాలో జగన్‌కు వివరంగా తెలిపారు. అందుకు చేయాల్సిన సాయం చేస్తానని మోదీ మాటిచ్చారు. ఆతర్వాత వారిద్దరు ఏమి మాట్లాడారనేది ఎవరికి తెలియదు. ఇద్దరే మాట్లాడుకున్నారు. అధికార్లు నేతలు ఎవరూ ఇద్దరి పక్షానలేరు. ఏమి మాట్లాడి ఉంటారో ఎవరికి అక్కర్లేదు. రాజకీయాల్లో, పాలనలో తప్పుల తడక చంద్రబాబుకే ఆ ఇద్దరూ ఏమిమాట్లాడారో అనేదికావాలి. తనను ఎలా కేసుల్లో ఇరికించాలి అనేది రాజకీయ  పండు మోదీ కొత్త సీఎం జగన్‌కు నూరిపోసి ఉంటారనే భయం బాబును ఆనాటి నుంచి వణికిస్తోంది.

బాబు భయపడుతున్నట్లే మోదీ అమ్ములపొదిలో టీడీపీని ప్రజల్లో దోషినిచేసే అస్త్రమే జగన్నాయుధం అని బాబు డిసైడ్‌ అయ్యారు. జగన్‌ పాలకుడుగా వచ్చిన వెంటనే బాబు ఆశల పల్లకి ప్రజావేదికను కుప్పకూల్చేసాహసం చేసారంటే మోదీ బలమే అని బాబు నమ్మారు. అవినీతి రహితపాలన చూపిస్తానంటూ పాతసర్కారు అవినీతిని ఆధారాలతో తీయమని మంత్రులకు చెబుతున్న జగన్‌కు మోదీ కొండంత అండఅయ్యారని బాబు గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఏశాఖలో ఏమి ముట్టుకున్నా అవినీతి జరిగినతీరు వరదలై పారుతుంది. కనుక చట్టం చట్రంలో ఇరుక్కోవడం తప్పదు. తప్పించుకోవడం బాబు అండ్‌కో తరంకాదని కూడా ఆపార్టీలో వినబడుతోంది. జగన్‌ నెలరోజుల పాలనను బాబు తనమందితో సమీక్షించారు. పాతసర్కారులో అవినీతిని జనాల్లో పెట్టేందుకు జగన్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు అంతాతేల్చారు. ఇక ఉన్న 22మంది ఎంఎల్‌ఏల ముందు బయటపడకూడదని, చులకనైపోతామని బాబు వారిముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.

కానీ, బాబుకు మరింత బితుకు అతుక్కుంది. గుండెల్లో జగన్‌ కదలికలు వేగాన్ని పెంచుతునే ఉన్నాయి. తనపై ఆధారాలు లేకుండా ప్రజల్లో లేనిపోని అవినీతి ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. మీవద్ద మా పాలన వివరాలు మొత్తం ఉన్నాయి. నిగ్గుతేల్చండి దేనికైనా సిద్ధం అని బాబు తాటాకుచప్పుళ్లు చేస్తున్నారు. దాంతో ఆధారాలు లేకుండా మేము ఏనాడు ఆరోపించలేదని జగన్‌ అండ్‌కో బదులిస్తూ బాబు పాలనలో అవినీతి నిగ్గు తేల్చడంలో తలమునకలై ఉంది. బాబులో లేనిది పెద్దరికం. ఒదులుకోలేనిది అహంకారం. ఇవే ఆయన గతపాలనలో జరిగిన లక్షల కోట్ల అవినీతిని వెలికి తీయించేలా చేస్తున్నాయి. బాబు 23 సీట్లతో ఘోర పరాభవాన్ని బూచిలా చూపించి రాజీనామా చేసేసి పార్టీని కొడుక్కో, భార్యకో, కోడలికో అప్పగించి పార్టీ తన గుమ్మంలో ఉన్నట్లు చేసుకునే అద్భుత డ్రామాకు తెరతీసి ఉంటే రాజకీయాలు వేరుగా ఉండేవి.

ప్రజావేదిక వైపు జగన్‌ సర్కారు ఇప్పట్లో వచ్చేదికాదు. చచ్చిన పామును ఇంకేం చంపుతామని జగన్‌కు ఆపార్టీలో పలువురు చెప్పేవారే. మోదీకూడా  బాబు ఇంటికే పరిమితమై మౌనదీక్షాపరుడయ్యారా? అని ఆశ్చర్యపోయేవారే. ఈ రాజీనామా డ్రామా కొన్నాళ్లుపాటు బాబును టీడీపీలో అభిమానధనుడని పేరు తెచ్చిపెట్టేదే. కానీ, బాబు ఓడినా గెలిచినట్టే అహం వదలకుండా ప్రదర్శిస్తునే ఉన్నారు. భద్రత కుదించడంపై కోర్టును ఆశ్రయించారు. భద్రత కేసు విచారణలో ఉంది. అయినా బాబుకు 74మందితో భద్రత కల్పించినట్లు రాష్ట్రసర్కారు ఒక ప్రకటనలో తెలిపింది. బాబు తీరుతో ఈసరికే టీడీపీ కుక్కలు చింపిన విస్తరి అయ్యింది.

వికేంద్రీకరణకే వైఎస్ జగన్ మొగ్గు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?