Advertisement

Advertisement


Home > Politics - Gossip

కరోనా మీడియానూ చుట్టేస్తోంది?

కరోనా మీడియానూ చుట్టేస్తోంది?

కరోనా మహమ్మారి అందరినీ చుట్టేస్తోంది. పబ్లిక్ లో వుండే పోలీసులు, వైద్య సిబ్బంది టార్గెట్ అవుతున్నట్లే మీడియా జనాలు కూడా దీని బారిన పడుతున్నారు. అసలే కరోనా కారణంగా ఆదాయం, సర్క్యులేషన్ పడిపోయి మీడియా కీందా మీదా అవుతోంది.  వీలయినంత తక్కువ మంది స్టాఫ్ తో షో రన్ చేస్తున్నారు. ఇప్పడు కరోనా కారణంగా స్టాఫ్ మరీ తగ్గిపోతున్నారని వార్తలు అందుతున్నాయి.

ఓ లీడింగ్ తెలుగు డైలీలో కీలకవ్యక్తి అయిన ప్రముఖ కార్టూనిస్టు కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. ఆ కార్టూనిస్ట్ ఇంట్లో పలువురకి కరోనా సోకినట్లు బోగట్టా. అలాగే అదే డైలీలో సండే మ్యాగ్ జైన్ లో పనిచేస్తున్న సిబ్బంది దాదాపుగా అందరూ కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. దీంతో సండే మ్యాగ్ జైన్ పనులు ఆగిపోయినట్లు బోగట్టా.

కరోనా బారిన పడిన జర్నలిస్ట్ లకు కేంద్రం సాయం అని తెగపోస్టులు కనిపిస్తుంటాయి కానీ అవన్నీ కేవలం అక్రిడేషన్ వున్నవారికి మాత్రమే. నిజానికి జర్నలిస్ట్ ల్లో నూటికి తొంభై మంది అక్రిడేషన్ వుండదు. యాజమాన్యాలు, ఎడిటోరియిల్ బాస్ ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వుంటుంది వ్యవహారం. 

నేను డీసెంట్.. రవితేజ పెద్ద క్రాక్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?