Advertisement

Advertisement


Home > Politics - Gossip

క్యాడర్‌ను నమ్మిస్తేచాలు.. జనాలకు ఇంజక్టు చేసేదివారే

క్యాడర్‌ను నమ్మిస్తేచాలు.. జనాలకు ఇంజక్టు చేసేదివారే

నేడు ఏపీలో జనాల కళ్లముందు జరుగుతున్న రాజకీయ విన్యాసాలు అన్నీ ఇన్నీకావు. విన్యసించేది నాలుగు నెలల క్రితం వరకు మహారాజ దర్జా అనుభవించిన తెలుగువారి ఆత్మగౌరవాన్ని  కాపాడే కంకణదారుడు నాటి సీఎం చంద్రన్నే. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చూపని దర్జా,దర్పం చంద్రన్నే జనాలకు చూపారు. తను చెప్పేది జీహుజూర్‌ అని పార్టీ క్యాడర్‌ తలలూపుతున్నట్లే ఏపీ జనాలు తలలు ఊపాల్సిందే అన్నట్లు ఐదేళ్ల కర్కోటక శాసకుడయ్యారు.తన పర్యటనల్లో జనాల్లో నిరశనలు తెలియచేసినా వారిపై ఒంటికాలిపై లేచి తోకలు కోస్తా,కత్తిరిస్తా అని గుర్రెత్తి  పోతుండేవారు.ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనుక్షణం పుట్టుకొచ్చే ప్రజా సమస్యలపై స్పందించే తీరు విచిత్రంగా ఉండేది. నేను చెబుతున్నా మీరు వినాల్సిందే అన్నట్లుండేవారు. సాక్షాత్తు సీఎం గుర్రుమంటుంటే ఎందుకొచ్చిన నిలదీతలు అన్నట్లు ఆయన సభలకు వచ్చిన అంతంతమాత్రంగా హాజరైన జనాలు నోళ్లు వెళ్లబెట్టే వారు.

ప్రతి గడపకు పెద్దన్నను అన్నాడు. ప్రతి ఇంటిని చూసుకునే బాధ్యత నాదే అని గడపగడపకు చెప్పినంత పనిచేసాడు. ఇప్పుడేమో సీఎంగా జనాలపాలిటి చండశాసనపర్వం పూర్తిస్థాయిలో చూపుతున్నాడు. దీనిబట్టి ఏరుదాటాక తెప్ప తగలేయడం ఇదే కాబోలు అని ఏపీలో సర్వతెలుగువారు తెలుసుకుని ఓటువేసిన వేలును తడుముకోసాగారు. ఓటుకు దండిగా నోటు కోసం చేతులు చాచే అలకాజనాలా నన్ను నిలదీసేది. నేను చెప్పేది శాసనం. నేను ఏమిస్తే అదే ఆబగా అందుకుని పంజాలెత్తి హరహర మహాదేవ చంద్రన్న అని కీర్తించాల్సిందే అన్నట్లు ఐదేళ్లు మహారాజపాలనను చేసి చూపారు. ఇందులో పార్టీని నమ్ముకున్న క్యాడర్‌ తనపాలనను జైకొడితే చాలన్నట్లుగానే క్యాడర్‌కు రెండుచేతులా తినబెడతూ సాగారు. ఓట్లప్పుడు ఇంతవరకు ఓటుకు ఇచ్చే నోటును మరికాస్తా ఎక్కువపడేస్తే కిమ్మనకుండా ఓటేసి గెలిపిస్తారని జనాలను అత్యంత చులకనగా చూసారు. అలా బాబు చూసారో లేదో అనేదానికి ఈమద్య ఆయన తీరు కృష్ణా వరదల్లో స్పష్టమయ్యింది.

వరదముంపులో గురయిన కొన్ని గ్రామాలకు పోయి కొత్తసర్కారుకు ఏమీతెలియనందున మీరంతా వరదల్లో నిండామునిగారు. సర్కారు ఏమాత్రం మీకు తగుసాయం చేయలేకపోయింది అని విరుచుకుపడుతూ నూరిపోయాలని చూసారు. దాంతో అక్కడ వరదబాధితులు కొత్తసర్కారు మాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేయాల్సిన సాయంచేసింది. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలింపులో గాని, మాకు ఆహారం, నీళ్లు అందించడంలో బిగ్‌హ్యాండ్‌ అనిపించుకుంది అని ఘాటుగానే బదులిచ్చారు. అలా ఎదురుచెప్పడం బాబు తట్టుకోలేపోయారు. తాను ఇంకా సీఎంగా ఉన్నట్లే జనాలపై ఎగిరెగిరిపడ్డారు. నా ఇల్లు ముంచడానికి మీ ఇళ్లను ముంచేసాడు సీఎం జగన్‌ అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించలేదు. అందుకు  వరదబాధితులు తీవ్రంగా స్పందించారు. ఐదేళ్లూ ఇలాంటి నమ్ము నమ్మకపోకూతలే విన్నాం అన్నట్టుగా బాబును పట్టించుకోలేదు. ఇక లాభం లేదు. జనాలకు మనమెంత నూరిపోసినా వారు డోంట్‌కేర్‌ అంటున్నారు.

ఎలాగూ తెలుగుదేశం పార్టీ సురభినాటక సమాజంను మించిన నటనాలయంలోంచి పుట్టుకొచ్చిన పార్టీ. వరదల్లో కొత్తసర్కారు జనాలను నీటిపాలు చేసింది ఆదుకోవడం చేతకాక చతికిలపడింది అని చాటడానికి రంగుల పూసుకుని కిరాయికి డైలాగులు వల్లించే వారితో రంగం సిద్దంచేసారు చంద్రన్న అండ్‌కో. ఎందుకంటే వచ్చిన వరదలు బాబు అక్రమ కట్టడమైన ఇంటిని ముంచేసాయి. వరదల్లో తనుండడం అంత క్షేమంకాదని తనఇంట్లో గ్రవుండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఖరీదైన వస్తువులు మీది అంతస్థులోకి బాబు తరలింపచేసారు. కృష్ణా కరకట్టల్లో నిర్మితమైన ఇంటిమీదకు వరదరాకుండా వందలాదో వేలాదో ఇసుకబస్తాలు అడ్డం పెట్టించారు. ఆపైన వరదల్లో ఎవరుపోతే నాకేం అన్నట్లు రాత్రికిరాత్రే హైద్రాబాద్‌కు బాబు యావత్‌ కుటుంబంతో పారిపోయారు. ఏపీ తెలుగువారు అక్రమకట్టడంలో ఉన్న చంద్రబాబు తీరుకు నోళ్లుబార్లా తెరిచారు.

తన పారుబోతు నిర్వాకం, కరకట్టల్లో అక్రమకట్టడం ఇలా బయటపడినందుకు పదింతలు జగన్‌ సర్కారుపై లేనిపోని ఆరోపణలు కుమ్మరించాల్సిందే అని పెయిడ్‌ ఆర్టిస్టులతో నడుం బిగించారు. వరద బాధితులతో కొత్తసర్కారు కేవలం నా ఇంటిని ముంచడానికి పలుగ్రామాలను ముంచేసేలా వరదలను తెచ్చారని ఎలుగెత్తారు. వరదలు జగన్‌ తీసుకురాగలడా? పీఎంకే సాధ్యంకాదని విన్నవారు నవ్విపోయారు. నవ్విపోదురు నాకేంటి అన్నట్లుగానే బాబు తన ఆరోపణలు ఏమాత్రం తగ్గించకుండా పదేపదే జగన్‌ తీసుకొచ్చిన వరదలే అని చెప్పడంలో సాగారు. ఆయనతో నడిచే ఆయన క్యాడర్‌కూడా అవేమాటలను వల్లె వేయడం జనాలు ఇంకా నవ్వుకున్నారు. అయినా వరదబాధిత జనాలకు నమ్మించాలని తనపెయిడ్‌ ఆర్టిస్టులను స్క్రిప్టు అండ్‌ డైరెక్షన్‌తో బాధితుల్లా మేకప్‌లు చేసి పచ్చటీవిల్లో మైకుల్లో హోరెత్తించారు. బాబు సీఎంగా ఉంటే ఇలా వరదల్లో మాతోనే ఉండేవారు. జగన్‌ వరదప్రాంతాలకు రాకుండా ఏమీతెలియని మంత్రులను పంపేసి చేతులు దులుపుకున్నారన్నట్లు చెప్పారు. ఇంకాస్తా నోటికి వచ్చినట్లు కూతలు కూడా విన్పించారు.

పెయిడ్‌ ఆర్టిస్టులనేది నటులకే కాదు. పార్టీ నేతలకు, మాజీ ఇరిగేషన్‌ ఉద్యోగులకు కూడా వర్తింపచేసిన బహుముఖ ప్రజ్ఞశాలి దిగ్రేట్‌ చంద్రన్న అని చెప్పకతప్పదు. వారు చానళ్లలో డిబేట్‌లలో బాబు ఇచ్చిన స్క్రిప్టు కూతలనే అక్షరం మిస్‌కాకుండా రాగయుక్తంగా చెప్పారు. అందులో బాబును ఎన్నికల వేళప్పుడు లెక్కలు తేలుస్తామన్న జనసేనుడు ఇప్పుడు బాబుదే సర్వం కరెక్టు అన్నట్లుగా మాట్లాడారు. అది విన్న జనాలు అరెరే మూడునెలల్లోనే ఇంతగా నాలుక మడత బెట్టుటయా అని అంతులేని ఆశ్చర్యానికి గురయ్యారు. బాబు స్క్రిప్టులో లేనివి కూడా జనసేనులవారు వల్లించారు. ఏ దైవబలమో, ఈవీఎంల పుణ్యమో జగన్‌కు సీఎం కుర్చీ దక్కింది. బాబు 2019 ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు చేసిన ఓటమి బితుకు ఆరోపణలనే జనసేనుడు మరోసారి జనాల్లో ప్రయోగించి బాబువద్ద ర్యాంకుమార్కులు పొందారు.

ఇక్కడే బాబు మరోసారి జనసేనుడుతో తనస్క్రిప్టును జనాల్లో చెప్పించడంలో తన బక్కపలచ భుజాలను చరుచుకున్నారు. ఎంతటివారైనా  నావాక్కును బ్రహ్మవాక్కుగా స్వీకరించాల్సిందే అని వరదల్లో జగన్‌పై తేరుకోలేని బురద చల్లానని, తన క్యాడర్‌ను నేనున్నా ననే ధైర్యం గుండెలు నిండుగా నింపానని బాబు ఒకింత సంతృప్తి చెందారు. జనాలను మహాఅసమర్ధులుగా చూసే ఏకైక రాజకీయవేత్త చంద్రన్నే. కోట్లాది జనాల్లో కొన్నివేలమంది నాయకత్వపటిమ ఉన్నవారే, మహా రాజకీయవిశ్లేషకులే. కానీ, అవకాశాలు లేక  రాజకీయాలను చర్చించడం వరకే పరిమితం అయ్యారు. అలాగే,  కొన్ని కోట్లమంది జనాలు అధికారపార్టీ తీరు చూస్తున్నాం. సీఎంను, మంత్రులను ఒక్కఓటుతో గిరికీలు కొట్టేలా చేద్దామన్నట్లు ఐదేళ్లుచోద్యం చూడడం వరకే, ఆపైన ఎన్నికల నాటికి పక్కాగా ఓటుతో మట్టి కరిపిద్దామని డిసైడ్‌ అయిపోతారు. అలాంటి రాజకీయ, సామాజిక పరిజ్ఞానం ఉన్న జనాలను బెల్లంముక్కతో నమ్మిద్దామనే బాబు అండ్‌కో పచ్చ పచ్చ మీడియా వారు ఎప్పటికప్పుడు మాడుపగిలేలా చతికిలపాటుకు గురవుతునే ఉన్నారు. అయినా వారు మారరు. వారు తీరు అలానే అప్రతిహాతంగా సాగుతునే ఉంటుంది.

ప్రధానంగా బాబుకు పట్టుకున్న బితుకు ఎటుచూసినా తన రాజకీయ దుందుడుకుతో మిత్రులను సయితం పక్కాగా శత్రువులుగా మార్చుకున్నాననే బాధ ఒకటి చేష్టలుడిగిస్తోంది. ఇందులో పక్కలో బల్లెం కొత్త సర్కారు అధినేత జగన్‌. అనవసరంగా ఆనాడు జగన్‌పై సోనియా కేసులు పెట్టేందుకు దారులు వెతుకుతుంటే అందులో జొరబడిపోయి జగన్‌పై కేసులు గుప్పించడానికి కారకుడయ్యానే. అలాగే, మోదీ వైకాపాతో అంటకాగుడు కంటపడడంతో పొత్తువదులుకున్నా ను. మోదీపై విమర్శలకు తెగబడి ప్రధాని పదవిలోంచి దించేయత్నం చేసి కేంద్రాన్నే శత్రువుగా చేసుకున్నాను. పొరుగున ఓటుకు నోటు కేసులో స్థబ్ధతగా ఉన్న కేసీఆర్‌పై ఎన్నికల్లో చిత్తుగా ఓడించేందుకు టీడీపీకి ఆగర్భశత్రువు కాంగ్రెస్‌తో భుజాల రాపిడీకి తెగబడాను. ఇలా అనుక్షణం తలచుకుని నిత్యం తలపట్టుకునే స్థితిలో బాబు చేష్టలుడిగారు. ఏక్షణం ఎవరు పార్టీవదిలి పోతారో అనే భయంతో బిక్కుబిక్కుమనాల్సి వచ్చిందే అని బాబు గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈలోగా బాబు చేసిన ఐదేళ్లపాలనలో దోచినదంతా పక్కా రికార్డులతో,పెక్కు ఆధారాలతో సహ కోర్టుబోనులో నిలిపేందుకు జగన్‌ అండ్‌కో ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.

పార్టీలో ఎవరు ఉన్నా పోయినా బాధపడుతూ అనారోగ్యం పాలుకారాదు. పార్టీక్యాడర్‌ కరిగిపోకుండా వారిని నమ్మిస్తూ, కొండంత ధైర్యం నూరిపోస్తూ ముందుకు సాగాల్సిందే. ఎలాగూ ఓటమి రోజున అయ్యో! ప్రజలకు ఇంతగా బాధించానా అని పత్రికలకెక్కడం శోకయోగంలో ఓపొరపాటు జరిగినది. ఆవెంటనే రెండు రోజులకు తేరుకుని ఎంతో అభివృద్ధి చేసానే, ఎందుకు  ఓడానో తెలియడం లేదని ప్రజలనే అడిగేలా కొత్తపల్లవి ఆలపించిన తీరుతో క్యాడర్‌కూడా నమ్మేలా చేసుకున్నాను అని తనకు తానే బాబు తలనిమురుకున్నారు. ఘోరఓటమిలో కూరుకుపోయినా, ఓట్లు పడ్డ శాతం కాకిలెక్కలు వేసే తన మాజీమంత్రులు 40శాతం ఓట్లుపడ్డాయి. అక్కడకి తేడా 10శాతమే. ఇది అసలు ఓటమే కాదని వారు చెప్పడం బాబుకు బాగా నచ్చింది. అంటే ప్రతి పదిమందిలో నలుగురు టీడీపీ నారాసుర పాలనలో నారాసురుడుకి వేసారంటే పార్టీ ప్రజల్లో కుంటుపడలేదు. కనుక ఆనలుగురిని నమ్మిస్తే వారే మిగిలిన ఆరుగురుకి ఎంతగా జగన్‌ సర్కారుపై నూరిపోయాలో అంతగా పోస్తారు.

ఆ దిశలో ప్రజలను నమ్మించే కంటే క్యాడర్‌నే నమ్మించాలి అని బాబు దృఢచిత్తులయ్యారు. ఆరుమాసాలు వరకు వేచిచూసాక జగన్‌ సర్కారు తీరుతెన్నులపై రణభేరీ మ్రోగిద్దామని అనుకున్నారు. కానీ, 40శాతం క్యాడర్‌ చెదరిపోకుండా నిలబెట్టుకోవడానికి అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికనుంచే సర్కారుపై ధ్వజమెత్తసాగారు. పసలేని ఆరోపణలు, చీటికిమాటికి సాక్షాత్తు చంద్రబాబే వైఎస్‌పాలనపై విమర్శలు గుప్పించి జగన్‌ విచక్షణను పరీక్షించేయత్నం చేసారు. బాబు 22మంది సభ్యులతో అసెంబ్లీలో ఆశీనుడయ్యాక తన ఎమ్‌ఎల్‌ఏలకు నోటితీటచూపమని జీతభత్యాలు లేని శాఖలను కేటాయించారు. నీవు ఇలా పెట్రేగు, నువ్వు అధికార పక్షంపై ఎదురుదాడిచేసి సీఎంను, మంత్రులను కాండ్రు మనిపించు. రకరకాలుగా నూరిపోసి రెడీచేస్తే ఓ నలుగురైదుగురు మాత్రమే బాబుకి జీహుజూర్‌ అంటూ అధికారపక్షంపై విమర్శలు గుప్పిస్తున్నారు. గత సర్కారులో పాతపాపాలు అధికార పార్టీచే తవ్వించుకుంటున్నారు. ఆపైన నాలుక కరుచుకుంటున్నారు.

మిగిలిన వారంతా మనకెందుకు లేనిపోని గిల్లికజ్జాలు? పార్టీకి అంకితమై పనిచేసినప్పుడు గుర్తించని బాబును పట్టుకుని వేలాడితే ఒరిగేది ఏమీలేదని మౌనం అయిపోయారు.  తప్పదని అసెంబ్లీకి హాజర్‌ అవుతున్నారు. జగన్‌పార్టీ తలుపులు తెరిస్తే పొలోమని దూరిపోయేవారే. 150మందికి పదవుల పంపకంలో సరైనన్యాయం చేయలేకపోతినే అని జగన్‌ మదనపడుతున్నారు. ఎందుకొచ్చిన పచ్చపార్టీ వారిని  లాక్కోవడం అని తలుపులు తెరవను అని భీష్మించేసారు. ఇదే జగన్‌ సర్కారుకు పెద్దమైనస్‌ అయ్యింది. ప్రతిపక్షనేత కాబట్టే బాబు సీఎంగానే వ్యవహరిస్తున్నారు. అలాగే ఆపార్టీలో అచ్చెన్న, బలరామ్‌, బుచ్చయ్య వంటి నేతలు అధికార్లపై రెచ్చిపోతున్నారు. ఒక్కసీటు గెలవని బీజేపీ టీడీపీలో ఓ పదిమందిని లాక్కుని రెండో ప్రతిపక్షంగా బీజేపీ అసెంబ్లీలో అడుగెట్టేయోచనకు జగన్‌ నిర్ణయమే దోహదపడింది.

జగన్ 100 రోజుల పాలనపై 'గ్రేట్ ఆంధ్ర' పేపర్ ప్రత్యేక కథనం 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?