Advertisement

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబులో పెరిగిపోతున్న అసహనం

చంద్రబాబులో పెరిగిపోతున్న అసహనం

చంద్రబాబు అధికారంలో ఉంటేనే రాష్ట్రం బాగున్నట్లుగా భావిస్తారు. ఆయన గద్దె దిగాక వేరెవరైనా సీఎం అయ్యాక ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరుతుంది. ప్రస్తుతం బాబు అలాగే వ్యవహరిస్తున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణి హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

చరిత్రలో నిలిచిపోయే పనులు ముఖ్యమంత్రిగా జగన్ చేస్తూంటే ఓర్వలేక చంద్రబాబు అక్కసుతో అనవసర‌ విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. బాబుది వక్ర బుద్ధి అందుకే జగన్ మీ భూమి మా హామీ అంటూ వందేళ్ల తరువాత సమగ్ర భూ సర్వేను జగన్ చేపడితే అందులో తప్పులు ఎంచడానికి బాబు తాపత్రయపడుతున్నాడని కిల్లి విమర్శించారు.

పేదలందరి భూములకు శాశ్వత‌ హక్కులు కల్పించాలని, వారంతా బాగుండాలని జగన్  తపన పడుతూంటే బాబు మాత్రం  తన అనుచరుల భూముల భూములకు అమరావతిలో రేట్లు ఎక్కడ పడిపోతాయోనని ఆందోళనతో  ఉన్నారని కిల్లి సెటైర్లు వేశారు.

ఏపీలోనే కాదు దేశంలోనే ముప్పయి లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం చరిత్రలో ఎక్కడా లేదని కూడా ఆమె అన్నారు. బాబు సహా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు అన్నీ కూడా అవాస్తవాలు అన్నది జనానికీ తెలుసు అంటూ చురకలు అంటించారు. మొత్తానికి బీపీని కొలవడానికి పరికరాలు ఉన్నాయేమో కానీ బాబులో నానాటికీ పెరిగిపోతున్న అసహనాన్ని కొలవడానికి ఏ మీటర్లూ లేవని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?