అచ్చంగా రాజకీయం చేస్తున్న చంద్రబాబు

రేషన్ షాపుల ద్వారా సరుకుల్ని ఇవ్వవద్దు అనేది చంద్రబాబు తాజా రాజకీయం. కరోనా ముసుగులో ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఏదో కుట్రలు పన్ని ప్రభుత్వం మీద బురద చల్లాలని తాపత్రయ పడుతున్న, హైదరాబాదు నుంచి…

రేషన్ షాపుల ద్వారా సరుకుల్ని ఇవ్వవద్దు అనేది చంద్రబాబు తాజా రాజకీయం. కరోనా ముసుగులో ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఏదో కుట్రలు పన్ని ప్రభుత్వం మీద బురద చల్లాలని తాపత్రయ పడుతున్న, హైదరాబాదు నుంచి కదలకుండా, ట్వీట్లు లేఖలతో హడావిడి చేస్తున్న చంద్రబాబునాయుడు.. పేదలందరికీ సరుకులు పంపిణీచేస్తూ ప్రభుత్వం ఒక మంచి పని సంకల్పించినప్పుడు దాని ద్వారా రాజకీయ ప్రయోజనం కోరుకుంటూ ఉండడం ప్రజలకు చీదరింపుగా ఉంటోంది.

రేషన్ షాపుల ద్వారా పేదలందరికీ సరుకులు ఇస్తామని.. లాక్ డౌన్ విధించిన సందర్భంలోనే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. కుటుంబానికి వెయ్యిరూపాయల వంతున డబ్బు సహాయం కూడా చేస్తామని ప్రకటించారు. అయితే రేషన్ షాపుల వద్ద ఇస్తే కుదర్దు.. ఇళ్లకే వెళ్లి ఇవ్వాలి.. అనే డిమాండుతో తెలుగుదేశం వర్గాలు ఇప్పుడు తాజా గోలను ప్రారంభిస్తున్నాయి. రేషన్ షాపుల వద్ద క్యూలైన్లలో నిల్చోబెట్టి జగన్ ప్రజలను చంపేస్తున్నారు.. అంటూ తలకాయలేని తెలుగుదేశం నాయకులు కొందరు నీచమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. కరోనా రాజకీయం చేయడంలో ఎంత నీచానికైనా దిగజారడానికి వారు వెనుకాడ్డం లేదు.

ఒక రకంగా చూస్తోంటే తెలుగుదేశం వ్యూహం ఇంకో రకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రేషన్ సరుకుల్ని ఇళ్ల వద్దకే చేర్చేలా ఒత్తిడి చేసి ప్రభుత్వాన్ని ఒప్పిస్తే గనుక.. మొదలైన రోజు దగ్గర్నించీ.. అందరికీ సరుకులు ఇవ్వడం లేదు.. సొంత పార్టీ వారికి మాత్రమే సరుకులు ఇస్తున్నారు. ఇవ్వవలసిన సరుకుల్ని కాజేస్తున్నారు. పార్టీ నాయకులు తినేస్తున్నారు.. వాలంటీర్లు తినేస్తున్నారు.. లాంటి లాంటి రకరకాల పద్ధతుల్లో బురద చల్లడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. రేషన్ షాపుల్లోనే ఇచ్చేట్లయితే.. అంతా పద్ధతిగా జరుగుతుంది. ఇక ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కుట్ర బుద్ధితోనే చంద్రబాబు ఈ డిమాండ్ చేస్తున్నట్టుందని ప్రజలు అనుకుంటున్నారు.

రేషన్ షాపు చిన్న యూనిట్ పరిధితో ఉంటుంది. అక్కడే సరుకులు ఇచ్చినంత మాత్రాన.. ప్రజలు గుమికూడి కిటకిట లాడే పరిస్థితి ఉండదు. సోషల్ డిస్టెన్సింగ్ అక్కడ పాటింపజేయడం మరీ అంత కష్టం కాదు. కానీ.. ఏదో జనాల్ని చంపేయడానికే రేషన్ సరుకులు ఇస్తున్నారన్నట్టుగా తెదేపా నాయకులు రాజకీయం చేసి మాట్లాడడం ఘోరంగా ఉంది.

ఇప్పటికైనా తెదేపా నాయకులు తమ కురచ బుద్ధులు మానుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. ఆ మాటకొస్తే.. రేషన్ కార్డులు లేని వారి పరిస్థితి ఏంటి? వారు షాపుల దగ్గరకు వెళ్తే చచ్చిపోతారా? సోషల్ డిస్టెన్సింగ్ జాగ్రత్తలతో బతకడం లేదా? అని అడుగుతున్నారు.

దేవినేని ఉమని ఉతికి ఆరేసిన కొడాలి నాని