చంద్రబాబుకి బీజేపీ అంటే అంత భయమా!

మహారాష్ట్రలో జరిగిన పరిణామాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోరు విప్పలేదంటూ ఒక ఆంగ్ల పత్రిక ఒక వ్యంగ్య కధనాన్ని ఇచ్చింది. చంద్రబాబుకు ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ భయం పట్టుకుందని ఆ పత్రిక…

మహారాష్ట్రలో జరిగిన పరిణామాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోరు విప్పలేదంటూ ఒక ఆంగ్ల పత్రిక ఒక వ్యంగ్య కధనాన్ని ఇచ్చింది. చంద్రబాబుకు ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ భయం పట్టుకుందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

తాను ఎక్కడ బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడి సమస్య వస్తుందేమోనని భయపడుతున్నారట. అంతేకాక, బిజెపితో మళ్లీ పొత్తు కోసం నానా తంటాలు పడుతున్నారని కూడా ఆ పత్రిక పేర్కొంది.

గత ఎన్నికలకు ముందు బిజెపిని తీవ్ర స్థాయిలో విమర్శించడమే కాకుండా డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వంటి వారితో కలిసి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. కాని ఆయనే ఎపిలో అదికారం కోల్పోవడంతో ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా పెదవి విప్పడం లేదు.

అప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతున్నానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తనకు మిత్రుడు కూడా అయిన శరద్ పవార్ కు కూడా మద్దతు ఇవ్వలేదు. బిజెపి అర్దరాత్రి రాష్ట్రపతిపాలన ఎత్తివేసి ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిని చేసినా ఒక్క వ్యాఖ్య చేయలేదేమిటో అని ఆ పత్రిక కదనాన్ని ఇచ్చింది.

గతంలో దేశంలో ఏ ఎన్నిక జరగినా తెలుగువారి ప్రభావం అంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా మారిపోయారా?