Advertisement

Advertisement


Home > Politics - Gossip

పోగేసే సొమ్ములకు చంద్రబాబు లెక్కచెప్తారా?

పోగేసే సొమ్ములకు చంద్రబాబు లెక్కచెప్తారా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంత రైతులు జేఏసీ అనే గొడుగుకింద సాగిస్తున్న పోరాటానికి మద్దతిస్తున్నారు. ఆ పోరాటం కోసం రాష్ట్రమంతా పర్యటించి.. జోలెపట్టి మరీ విరాళాలు సేకరిస్తున్నారు! సొమ్ములు పోగవుతున్నాయి. ఇంతకూ చంద్రబాబునాయుడు జోలె పడుతోంటే.. ఎంత డబ్బులు వస్తున్నాయి. మొన్న బందరులో వచ్చినవెంత? రాజమండ్రిలో వచ్చినవెంత? తిరుపతిలో వచ్చినవెంత? ఆ సొమ్ములను జేఏసీ సాగిస్తున్న పోరాటంలో ఏయే అవసరాలకు ఖర్చు పెడుతున్నారు... అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

అమరావతి ప్రాంత రైతుల పోరాటానికి ఆర్థికంగా సంఘీభావం కూడగట్టడంలో చంద్రబాబునాయుడు కొత్తపుంతలు కూడా తొక్కుతున్నారు. మూడు రోజుల పాటూ ఊర్లు తిరిగి జోలెపట్టి నిధులు సేకరించిన ఆయన తాజాగా ఆన్లైన్ విరాళాల దందాను కూడా ప్రారంభించారు. అమరావతి పరిరక్షణ సమితి వారి బెజవాడ బ్యాంకు ఖాతా నెంబరును, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను ప్రకటించి ఆ ఖాతాకు ప్రజలందరూ విరివిగా తమ విరాళాలు ట్రాన్స్‌ఫర్ చేయాలంటూ చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు. ఆన్‌లైన్ లో చందాల దందా అనగానే.. సాధారణంగా ఒక ఊపు వస్తుంది. విదేశాలలో స్థిరపడిన ఒక సామాజిక వర్గంలో చంద్రబాబు హవా పుష్కలంగా ఉన్నది గనుక... దాదాపుగా వారందరికీ కూడా అమరావతి ప్రాంత భూదందాలతో సంబంధాలు ఉన్నవి గనుక.. ఆన్ లైన్ చందాలు కూడా ఇబ్బడిముబ్బడిగా వచ్చే అవకాశం ఉంది.

చందాలు ఎలాగైనా రావొచ్చు గాక.. కానీ జవాబుదారీ తనం ఎవరిది? పోరాటం కోసం ప్రజలు ఇస్తున్నారు. మరి ఆ పోరాటానికి ఏం ఖర్చవుతోంది? ఏ అవసరాలకు పెడుతున్నారు? ప్రజలకు తెలిసేలా చంద్రబాబు పారదర్శకంగా చేయాలి కదా అనే ప్రశ్నలు ప్రజలనుంచి వస్తున్నాయి. ముందు ఎంత సొమ్ము వసూలవుతున్నదో లెక్క చెప్పాలి... అలాగే దానిని ఏ అవసరాలకు వాడుతున్నారో కూడా చెప్పాలి.. బ్యాంకు ఖాతా క్రెడిట్ డెబిట్ లను కూడా పారదర్శకంగా ఉంచాలని ప్రజలు ఆశిస్తున్నారు. పోరాటానికి చంద్రబాబు మద్దతివ్వడం, ఆయన సమయాన్ని వెచ్చించడం ఓకే. కానీ ప్రజల నుంచి సొమ్ము స్వీకరించడం ప్రారంభం అయ్యాక.. దానికి లెక్క చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?