Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఓట్లు చేజారకుండా చంద్రబాబు పాట్లు

ఓట్లు చేజారకుండా చంద్రబాబు పాట్లు

చంద్రబాబునాయుడు పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. తమ పార్టీ తరఫున ఎందరు ఎమ్మెల్యేలు గెలిచారో ఆయనకు తెలుసు. అయితే గెలిచిన వారిలో ఎందరు ఇంకా తన పార్టీలోనే మిగిలి ఉన్నారనే సంగతి మాత్రం ఆయనకు తెలియదు గాక తెలియదు. ఎంతమంది కనీసం తెదేపా వారి కింద మనుగడలో ఉన్నారో.. ఎందరు పూర్తిగా ఎటాచ్ మెంట్ తెంచేసుకున్నారో.. తుంచేసుకున్నారో కూడా తెలియదు.

వల్లభనేని వంశీ సంగతి ఓకే.. వెళ్లిపోయిన సంగతి ఖరారైంది. మద్దాళి గిరి, గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు… అలాంటి వాళ్లు ఇంకా ఎందరున్నారో తెలియదు. అందుకే చంద్రబాబు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఓ కేండిడేట్ ను పోటీకి దించి.. తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ విధిగా అతనికి మాత్రమే ఓటు వేయాలంటూ విప్ కూడా జారీచేయబోతున్నాడు.

ఇందులో చంద్రబాబునాయుడుకు ఒక లాభం ఉంది. కనీసం పార్టీలో ఎందరు ఎమ్మెల్యేలు మిగిలి ఉన్నారో లెక్క తెలుస్తుంది. పైకి డిజిగ్నేషను ప్రకారం ఎమ్మెల్యేలు తమ పార్టీ ట్యాగ్ లైన్ తోనే ఉన్నప్పటికీ.. ఎందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారో.. ఎందరు ఆగూటి చిలకల్లాగా మారిపోయారో తెలుస్తుంది.

విప్ జారీ చేయడం వలన.. తెదేపా ఎమ్మెల్యేలందరూ విధిగా వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది. పైగా.. తమ పార్టీ ఏజంటుకు చూపించి మాత్రమే ఓటు వేయాలని కూడా చంద్రబాబునాయుడు కండిషను పెడుతున్నారు. ఈ మాట వింటే.. చంద్రబాబునాయుడులో ఎంతగా భయం నిండిపోెయి ఉందో అర్థమౌతుంది.

తమ పార్టీ వారి మీద ఎంత అపనమ్మకం ఉందో అర్థమౌతుంది. ఇలాంటి విప్ ద్వారా చంద్రబాబునాయుడు మరో లక్ష్యం కూడా పెట్టుకున్నారు. ఎవరైనా తమ ఎమ్మెల్యేలు విప్ కు అనుకూలంగా ఓటు వేయకపోయినా.. పోలింగ్ కు గైర్హాజరైనా.. వారి మీద అనర్హత వేటు వేయించడానికి కూడా ఆయన కసరత్తు చేసుకుంటున్నారు.

గెలిచిన తర్వాత తనను ఖాతరుచేయకుండా పోయిన వారి గురించి ఆయనకు అంచనా ఉంది. వారందరినీ వదిలించుకోవాలని చూస్తున్నారా? అనే అనుమానం కూడా ప్రజల్లో ఉంది. అయినా.. వైకాపా కు చెందిన నలుగురూ గెలవడానికి ఈ 22 ఓట్ల అవసరం ఎంతమాత్రమూ లేదు. వాళ్లందరూ ఓట్లేసినా..వర్ల రామయ్య గెలిచేది లేదు. విప్ అందుకుని.. వారిలో ఎవరైనా గైర్హాజరైనా కూడా.. చంద్రబాబు వారిమీద అనర్హత వేటు వేయండడం అనేది అంత ఈజీ కాకపోవచ్చు అని పలువురు భావిస్తున్నారు.

సీఎంను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు 

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?