Advertisement

Advertisement


Home > Politics - Gossip

చెవిరెడ్డి రాజకీయం తిరుపతి వైసీపీలో చర్చ!

చెవిరెడ్డి రాజకీయం తిరుపతి వైసీపీలో చర్చ!

చెవిరెడ్డి కన్ను తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌ మీద కూడా పడుతోందా? ఒకవైపు తనకు సిటీ పాలిటిక్స్‌ మీద ఆసక్తిలేదంటూ ప్రకటించినా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు తిరుపతి రాజకీయంలో నలుగుతూ ఉండటం గమనార్హం. తిరుపతిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి భూమన కరుణాకర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు భూమన తనయుడు కూడా రాజకీయంగా యాక్టివ్‌గా కనిపిస్తూ ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా తిరుపతి రాజకీయంపై కన్నేశారనే ప్రచారం జరుగుతూ ఉంది. దానికి పలు కారణాలున్నాయి. చెవిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నది చంద్రగిరి నియోజకవర్గం నుంచి అయినా.. ఆయనకు తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(తుడా) చైర్మన్‌ పదవి దక్కింది. గతంలో కూడా చెవిరెడ్డి ఆ పదవిని నిర్వహించారు.

తుడా చైర్మన్‌గానే అప్పట్లో చెవిరెడ్డి రాజకీయంగా ఉనికిలోకి వచ్చారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావంతో చంద్రగిరిలో పాగా వేశారు. వరసగా రెండుసార్లు విజయం సాధించారు. రెండుసార్లూ చెవిరెడ్డి విజయాలు గొప్పవే. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు మళ్లీ తుడా చైర్మన్‌గా ఆయన తిరుపతిలో హల్చల్‌ చేస్తున్నారనే భావన వ్యక్తం అవుతోంది.

చెవిరెడ్డి తనయుడి పేరిట కూడా తిరుపతిలో ఫ్లెక్సీలు అగుపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత చర్చనీయాశంగా మారింది. ఈ అంశంపై చెవిరెడ్డి స్పందిస్తూ తిరుపతి రాజకీయంపై ఆసక్తి లేదన్నట్టుగా తేల్చారు. అయితే భూమన కరుణాకర్‌ రెడ్డి అనుచరవర్గంలో మాత్రం ఈ అంశంపై చర్చ మొదలైంది. ఈ అంశంపై భూమనకు టెన్షన్‌ లేకపోయినా భూమన అనుచరులు మాత్రం చెవిరెడ్డి గురించి చర్చించుకుంటూ ఉన్నారు.

ఇప్పటికే తుడా చైర్మన్‌, విప్‌ పదవికి తోడు టీటీడీలో ఎక్స్‌ అఫిషియో మెంబర్‌గా కూడా చెవిరెడ్డి అవకాశం పొందారు. ఇలా పలు పదవుల నేతగా ఉన్నారు. ఇప్పుడు తిరుపతిలో కూడా చెవిరెడ్డి రాజకీయం సాగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటికి ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి చెవిరెడ్డి కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టున్నారు! దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డితో పాటు భూమన కరుణాకర్‌ రెడ్డి తనకు రాజకీయంగా గురుతుల్యులే అని అంటున్నారు. తిరుపతిలో ఫ్లెక్సీలు కావాలని ఏర్పాటు చేస్తున్నవి కావని, అదంతా అభిమానుల పని అని ఆయన వ్యాఖ్యానించారు.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?