పెళ్లికి ఎవరైనా బస్సు బుక్ చేస్తారు, కార్లు బుక్ చేస్తారు. కానీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాత్రం 17 ప్రత్యేక విమానాలు బుక్ చేశాడు. అది కూడా పెళ్లి కోసం కాదు, జస్ట్ నిశ్చితార్థం కోసం. అవును.. తన కొడుకు రిత్విక్ ఎంగేజ్ మెంట్ కోసం ఇన్ని విమానాలు బుక్ చేశాడు సీఎం రమేష్. ప్రత్యేక విమానాల్లో ఇండియా నుంచి ప్రముఖులందర్నీ దుబాయ్ తీసుకెళ్లాడు.
సాధారణంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ చూస్తుంటాం. కానీ సౌండ్ పార్టీ అయిన సీఎం రమేష్ మాత్రం నిశ్చితార్థానికి కూడా డెస్టినేషన్ ను ఎంచుకున్నాడు. దుబాయ్ లో భారీ ఎత్తున కొడుకు ఎంగేజ్ మెంట్ చేస్తున్నాడు. పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో, రిత్విక్ నిశ్చిరార్థం మరికొన్ని గంటల్లో దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.
కేవలం ఈ నిశ్చితార్థం కోసమే 25 కోట్ల రూపాయల వరకు సీఎం రమేష్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక పెళ్లికి అతడు ఎంత ఖర్చు చేయబోతున్నాడనేది ఊహకే అందని విషయం. ఈ నిశ్చితార్థానికి బీజేపీకి చెందిన పలువురు కీలక ఎంపీలు హాజరవుతున్నారు. వాళ్ల కోసమే ఈ ప్రత్యేక విమానాలన్నీ.
ఇక సీఎం రమేష్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే దుబాయ్ లో ల్యాండ్ అయ్యారు. గంటాతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా ఈ ఫంక్షన్ కు వెళ్తున్నారు. సీఎం రమేష్ మాజీ బాస్ చంద్రబాబు ఈ వేడుకకు వెళ్లకపోయినా.. తన ఆశీస్సులు మాత్రం అందిస్తారు. సీఎం రమేష్ కు క్లోజ్ గా ఉండే కొంతమంది రాయలసీమ వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ వేడుకకు హాజరుకాబోతున్నారు.