డబ్బు పంచడం ఆల్రెడీ జరిగిపోతున్నది!

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలనేది సామెత. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా అదే వ్యవహారం కనిపిస్తోంద. ఎన్నికల నిర్వహణలో ఒక పారదర్శకమైన, నీతిమంతమైన వ్యవస్థను ఆవిష్కరించడానికి సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.…

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలనేది సామెత. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా అదే వ్యవహారం కనిపిస్తోంద. ఎన్నికల నిర్వహణలో ఒక పారదర్శకమైన, నీతిమంతమైన వ్యవస్థను ఆవిష్కరించడానికి సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే.. ఆర్డినెన్స్ ద్వారా కొన్ని నియమాలు కొత్తగా తెచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసేవారిపై కఠినమైన కేసులు నమోదుచేసి శిక్షించాలని నిర్ణయించారు. కానీ.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేంటంటే.. ఎన్నికల గంట మోగకముందే.. అప్పుడే నగదు పంపిణీలు ప్రారంభం అయిపోయాయి…!!

స్థానిక సంస్థల ఎన్నికల్లో.. నిజానికి ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తడవ జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక్కో ఓటు రేటు రెండువేల రూపాయల వరకు చేరిందని వినిపించింది. కానీ సాధారణంగా.. ఆ ఎన్నికల కంటె పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు రేటు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోయూనిట్లో మొత్తం ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండడం.. ప్రతి ఒక్క ఓటు అవసరం పెరగడమే ఇందుకు కారణం. పైగా పంచాయతీల్లో సర్పంచి ఎన్నికలు వ్యక్తిగత ప్రతిష్ట, ఆవేశకావేషాలకు ప్రతిబింబంగా జరుగుతాయి. అందువల్ల.. నాయకులు తెగించి ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఓటు ధర పెరుగుతుంటుంది.

అయితే ఇప్పుడు జగన్ సర్కారు కట్టడి చేసే ప్రయత్నం మొదలెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. నామినేషన్ వేసిన నాటినుంచి.. చేసే ఖర్చు, నడిపే వ్యవహారాలు ‘ఎన్నికల’ పరిధిలోకి వస్తాయి. అయితే.. చాలా చోట్ల.. ఎవరూ ఈసారి అభ్యర్థి  కాగలరో ముందే అంచనా ఉంటుంది గనుక.. వారినుంచి.. ధన ప్రవాహం ఆల్రెడీ మొదలైపోయింది. తమ తమ గ్రామాల్లో ఓటర్లకు ఇప్పటికే డబ్బు పంపిణీ ముగించేస్తున్నారు. ఖచ్చితంగా గెలవడానికి అవసరమైనన్ని ఓట్లకు ఈపాటికే ఇవ్వడం పూర్తి చేసేస్తున్నారు.

ఒకవేళ ఆల్రెడీ పంచిన నాయకుడికి కాకుండా మరొకిరికి టికెట్ వచ్చినా… ఇప్పటిదాకా పంచిన మొత్తాన్ని ఆ ఒక్కనాయకుడికి ఇచ్చేస్తే సరిపోతుంది. ఎన్నికల గంట మోగకముందే ప్రజలకు డబ్బు పంచిన సంగతి, ఆ తర్వాత ధ్రువపడినా కూడా.. ఆ డబ్బు ఓట్లకోసమే పంచినట్లుగా రుజువు చేయడం కష్టం అవుతుంది. ఏదో అవసరం ఉంటే ఆర్థికసాయం చేసినట్లుగా చెప్పుకుంటే కాదనలేరు. లీగల్‌గా నిరూపణ అయ్యే అవకాశం తక్కువ. అందుకే అందరూ ముందస్తు పంపిణీల్లో మునిగి ఉన్నట్లుగా తెలుస్తోంది.

కరోనా సోకకుండా ఉండటానికి సులభమైన పద్ధతులు