Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆ మాటల అర్థం.. ఫిరాయిస్తున్నట్లేగా..?

ఆ మాటల అర్థం.. ఫిరాయిస్తున్నట్లేగా..?

తెలుగుదేశం పార్టీ అవసానదశకు చేరుకుంది. ఆ విషయాన్ని గుర్తించిన నాయకులు చాలామంది పక్కదార్లు వెతుక్కుంటున్నారు. ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఈ పతనాన్ని గమనించిన అధినేతలోని కంగారు.. ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో.. ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి బేరాలు పూర్తిగా కొలిక్కి తీసుకురాని నేతలు మాత్రం.. పార్టీని వీడే ప్రసక్తే లేదని పైపై మాటలు చెబుతున్నారు. ఇదంతా నోటితో కాదంటూ నొసటితో సిగ్నలిచ్చే బాపతు వ్యవహారంలా కనిపిస్తోంది.

తెలుగుదేశానికి చెందిన చాలామంది వైకాపాలోకి వచ్చేస్తున్నారు. పార్టీ పుట్టినప్పటినుంచి ఉన్నవారే కొందరు ఫిరాయిస్తుండగా.. కేవలం తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఆ పార్టీ పాలన కాలంలో ఆ పంచన చేరిన వారికి ఇప్పుడు పార్టీ మీద ఆశలుడిగిపోయాయి. వారంతా యిపుడు వైకాపాలోకి వచ్చేస్తున్నారు. అయితే తెదేపా అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాత్రం పార్టీని వీడే ప్రసక్తే లేదని అంటున్నారు. అదేసమయంలో ఆయన చెబుతున్న మాటలు మాత్రం ఫిరాయింపునకు బేరాలు సాగుతున్నట్లుగా ధ్వనిస్తున్నాయి.

నేను పార్టీ వీడుతున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజంకాదని డొక్కా అంటున్నారు. వైకాపానేత ఒకరు ఆ పార్టీలోకి ఆహ్వానించారని, ‘ఇప్పుడే తొందరేముందం’టూ తాను జవాబిచ్చానని స్వయంగా ఆయనే చెబుతున్నారు. ఇప్పుడే తొందరేముంది అనడం అంటే.. పరోక్షంగా ‘కొన్నాళ్లాగి మీ పార్టీలోకి వచ్చేస్తా’ అనే అర్థమే వస్తుందని ఎవరైనా భావిస్తారు. నిజానికి డొక్కా ఉద్దేశం కూడా అదే కావొచ్చు. మీడియా ద్వారా ఆయన అదే సంకేతాలు ఇస్తుండవచ్చు.

కానీ పైకి మాత్రం.. అబ్బెబ్బే పార్టీ మారడం లేదంటూ... సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏదో రాజకీయంగా దిక్కులేకుండా పోయిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో తెదేపా పంచన చేరిన ఆయన లాంటి నాయకులు.. అధికారం మారిన తర్వాత మళ్లీ అధికార పార్టీ పంచన చేరడం విశేషమేమీ కాదు.. కాకపోతే ఇలాంటి అవకాశవాదుల్ని వైకాపా ఎంత సమర్థంగా డీల్ చేయగలుగుతుందా.. అనే ప్రజలు చర్చించుకుంటున్నారు.

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?