చేష్టలుడిగిన ఎన్నికల సంఘం

వక్ర ఆలోచనలతో, కుట్రపూరితమైన ఉద్దేశాలతో వ్యవహరిస్తున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల సంఘం ఒక్కసారిగా అచేతనంగా మారింది! తమ ఆదేశాలను పట్టించుకునే దిక్కు లేకపోవడంతో అగమ్యగోచర స్థితిలో పడిపోయింది! ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో……

వక్ర ఆలోచనలతో, కుట్రపూరితమైన ఉద్దేశాలతో వ్యవహరిస్తున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల సంఘం ఒక్కసారిగా అచేతనంగా మారింది! తమ ఆదేశాలను పట్టించుకునే దిక్కు లేకపోవడంతో అగమ్యగోచర స్థితిలో పడిపోయింది! ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో… మరిన్ని ఆరోపణలు, విమర్శలు మూట కట్టుకోకుండా పరిస్థితిని ఎలా నెగ్గుకు రావాలో వారికి బోధపడటం లేదు.వివరాల్లోకి వెళితే… సామాజికవర్గ ఫీలింగులతో వ్యవహరిస్తూ రాష్ట్ర విస్తృత ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఈ విషయాన్ని తన ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా ఎత్తి చూపించారు. ఆయన తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం ద్వారా… ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఒకరకంగా షాక్ ఇచ్చారు.

చంద్రబాబు సూచనల ప్రకారం ఎన్నికల సంఘం నడుస్తున్నదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో జగన్ కృతకృత్యులయ్యారు. 5కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదు కాగానే… స్థానిక ఎన్నికలను ఏకంగా 6 వరాల పాటు వాయిదా వేయడం అనేది… ప్రభుత్వానికి మింగుడు పడలేదు.

మార్చ్ 31 లోగా ఎన్నికలు పూర్తి కాకపోతే రాష్ట్రానికి రావాల్సిన సుమారు 4100 కోట్ల రూపాయల సొమ్ములు, కేంద్ర నిధులు మురిగిపోతాయి. కేవలం ఆ ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే… బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లి తమ చిత్త శుద్దిని నిరూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. నిధులపరంగా రాష్ట్రానికి అన్యాయం జరగకూడదని జగన్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అయితే ఇంత చేసినప్పటికీ ఈసీ రూపంలో ఈ నిధులకు గండి కొట్టే ప్రయత్నం జరిగింది.

ఈ నేపథ్యంలో ఇదివరకు ఈసీ వెలువరించిన బదిలీ, సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా వివాదాస్పదంగా మారాయి. అవి కూడా దురుద్దేశాలతో కూడిన ఉత్తర్వులుగా భావించే పరిస్థితి ఏర్పడింది. ఆ ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకుండా ఆపేసింది. దీంతో ఎన్నికల సంఘానికి దిక్కు తోచడం లేదు. ఇప్పటికే కులాభిమానంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని అపకీర్తి వారికి దక్కింది. తమ ఆదేశాలను పట్టించుకోక పోవడంపై ఇప్పుడు ఎలా స్పందించాలో వారికి అర్ధం కావడం లేదు. మొత్తానికి ఈసీ అచేతనంగా, నిశ్చేష్టంగా మారిపోయింది.

నన్ను కూడా సేమ్ టు సేమ్ అంటారేమోనని కొంచెం భయం

యుద్ధం మధ్యలో యోగాసనాలు వెయ్యకూడదు