ఆమె తండ్రి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రి. అప్పట్లో ముఖ్యమంత్రిని మించి అన్నీ తానే అయినట్లుగా చక్రం తిప్పారు. తన శాఖకు సంబంధించినా, లేకపోయినా.. ప్రతి వ్యవహారంలోనూ తానే కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. వందల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలను మాత్రం చూసుకుంటున్నారు.
‘సైలెన్స్’ విషయానికి వస్తే… తెలుగుదేశం పార్టీ పాలనలో మంత్రులుగా పనిచేసి, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన చాలా మంది ఇప్పుడు సైలెన్స్ గానే ఉన్నారు. కానీ.. వారెవ్వరూ కూడా ఈ మంత్రి స్థాయిలో అప్పట్లో చక్రం తిప్పిన వారు కాదు.
ఆయన 2014కు పూర్వం తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తల్లో ఒకరు. పార్టీకి ప్రధానఆదాయవనరుగా ఉన్నారు. ఫలితం, పార్టీ గెలవగానే, మంత్రిపదవి లభించింది. ఆ పదవి కూడా దొడ్డిదారిలో వచ్చిపడింది. ముందు మంత్రిపదవి పుచ్చుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఆనాటినుంచి రాష్ట్ర పాలన వ్యవహారాల్లో సమస్తమూ తానే అయి చక్రంతిప్పారు. ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయారు. ఆటోమేటిగ్గా సైలెంట్ అయిపోయారు. ఆయన వ్యాపారాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని సమాచారం.
విశ్వసనీయంగా తెలుస్తున్న దాన్ని బట్టి.. సదరు మాజీ మంత్రి కూతురు, ఆయన వ్యాపారాల బాధ్యతను స్వయంగా చూసుకుంటున్నారు. ఆమె ఇటీవల.. జగన్ దంపతులను స్వయంగా కలిసినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యవహారాలు అన్నీ తన తండ్రి చక్కబెట్టినప్పటికీ.. తాము బావుకున్నది ఏమీ లేదని ఇంకా డబ్బు వదలిందే తప్ప వచ్చింది లేదని అని చెప్పుకున్నట్లు సమాచారం.
ఇప్పుడు తాము రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండదలచుకోలేదని, కేవలం వ్యాపారాలు చూసుకోవడం తప్ప మరో ఉద్దేశం లేదని జగన్ కు చెప్పుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తమ వ్యవహారాల్లో అవినీతిని లోడడం ప్రారంభిస్తే ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ఇలా ముందే చెప్పుకున్నట్లుగా వినిపిస్తోంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో… మాజీ మంత్రిగారి తనయ విన్నపాలు ఏమౌతాయో వేచిచూడాలి.