‘గంటా’ ఎంట్రీ వెనుక మైనింగ్ మాఫియా?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైకాపా ఎంట్రీ గ్యాసిప్ ల వెనుక విశాఖ జిల్లాలో మైనింగ్ మాఫియా వుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల కొంతకాలంగా విశాఖ జిల్లాలో మైనింగ్ వ్యవహారాల అవినీతి, అక్రమాల…

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైకాపా ఎంట్రీ గ్యాసిప్ ల వెనుక విశాఖ జిల్లాలో మైనింగ్ మాఫియా వుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల కొంతకాలంగా విశాఖ జిల్లాలో మైనింగ్ వ్యవహారాల అవినీతి, అక్రమాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. విశాఖ జిల్లానే కాదు, ఉత్తరాంధ్ర లో మైనింగ్ వ్యవహారాల వెనుక తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే కీలక సామాజిక వర్గం వుంది. దశాబ్దాల కాలంగా ఈ వర్గమే మైనింగ్ వ్యవహారాలను తన గుప్పిట్లో వుంచుకుని వేల కోట్లు ఆర్జిస్తోంది.

ఇప్పుడు తొలిసారి ఈ వ్యవహారాలకు గండి పడింది. ఇప్పటికే విశాఖ జిల్లాలో కొన్ని మైనింగ్ సంస్థలకు కోట్లకు కోట్లు పెనాల్టీలు పడ్డాయి. ఇప్పుడు ఆ సంస్థలు గుక్క తిప్పుకోలేకుండా వున్నాయి. ఇప్పుడు ఇలాంటి వారందరికీ ఓ మాట సాయం చేసే నాయకుడు వైకాపాలో కావాలి. అలా ఎవ్వరూలేరు. అందుకే గంటా శ్రీనివాసరావు కనుక అర్జెంట్ గా వైకాపా తీర్థం తీసుకుంటే, ఓ అండ దొరికినట్లు అవుతుంది. 

కనీసం మాట సాయం చేసే మనిషి దొరికినట్లు అవుతుంది. గంటా శ్రీనివాస రావుకు వివిధ వర్గాలతో అనేక వ్యాపార లావాదేవీలు వున్నాయని రాజకీయ వర్గాల్లో తరచు వినిపిస్తూవుంటుంది. ఆయనకు భాగస్వామ్యం వుండకపోవచ్చు కానీ ఆయన అండ దండలు వుంటాయి. అందుకే నాలుగేళ్ల పాటు ప్రతిపక్షంలో వుండి, తన వాళ్లకు సాయంచేయలేని స్థితిలో వుండడం కన్నా, వైకాపాలోకి వెళ్లి అంతో ఇంతో సాయం అందించడం బెటర్ అనే ఆలోచనలోంచే ఈ ఫిరాయింపు వ్యవహారం పురుడు పోసుకుందని తెలుస్తోంది. 

అంతగా కావాలంటే నాలుగేళ్ల తరువాత అప్పటి పరిస్థితి చూసి మళ్లీ అట్నుంచి ఇటు రావచ్చు. అందుకే గంటా పార్టీ మారినా, ఆయన అనుచర గణం మాత్రం తేదేపాలోనే ప్రస్తుతానికి వుంటుందని తెలుస్తోంది. ఇదంతా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పార్టీలో చేర్చుకుంటేనే. లేకుంటే ఏదీ లేదు.

పవన్ కళ్యాణ్ మనిషే అదో టైప్