Advertisement

Advertisement


Home > Politics - Gossip

హైదరాబాద్ ను యుటి చేస్తే..?

హైదరాబాద్ ను యుటి చేస్తే..?

తెలంగాణ చకచకా అభివృద్ది చెందుతోంది. దానికి కారణం కేవలం అప్పులు తెచ్చి చేస్తున్న పనులు మాత్రమే కాదు. హైదరాబాద్ నుంచి వస్తున్న అపరమిత ఆదాయం కూడా. అలాంటి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే పరిస్థితి ఏమిటి? 

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేస్తోందని రాజకీయ వర్గాల్లో గ్యాసిప్ వినిపిస్తోంది. కేవలం హైదరాబాద్ ను మాత్రమే కాదు, కలకత్తా, బెంగళూరు లాంటి మరో రెండు మూడు మహా నగరాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి ఎంత వరకు నిజమో అన్నది తెలియదు. అలా చేస్తే మాత్రం ప్రతిపక్షాలు భగ్గుమంటాయి. ఎందుకంటే హైదరాబాద్, కలకత్తా, బెంగళూరుల్లో భాజపా అధికారంలో లేదు. అందువల్ల కావాలనే ఇలాంటి పనికి ఒడి గట్టిందని ఆందోళనలు మొదలవుతాయి. 

తెలంగాణ నుంచి హైదరాబాద్ ను విడదీస్తే చాలా అంటే చాలా అన్యాయం చేసినట్లే అవుతుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలోని సెకండరీ ప్రాంతాలు అభివృద్ది చెందుతున్నాయి. వాటన్నింటికీ ఆలంబన హైదరాబాద్ నే. అందువల్ల ఆ అభివృద్దికి ఆటంకం కలుగుతుంది.

కచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం, ప్రజా పోరాటం వంటివి మొదలవుతాయి. కానీ అసలు ఇంతకీ కేంద్రం మదిలో ఇలాంటి ఆలోచన వుందో లేదో అన్న క్లారిటీ లేదు. ప్రస్తుతానికి వినిపిస్తున్నది వట్టి గ్యాసిప్ నా, ఎవరో కావాలని పుట్టించిన గ్యాసిప్ నా అన్నది తెలియదు. కొన్ని రోజులు ఆగితే దీని వైనం తేలుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?